Home వనపర్తి నిర్లక్ష్యపు ఉపాధ్యాయులకు మెమోలు జారీ

నిర్లక్ష్యపు ఉపాధ్యాయులకు మెమోలు జారీ

పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు : డిఇఒ సుశీందర్‌రావు

Mana-telanganaవనపర్తిప్రతినిధి: వనపర్తి జిల్లాలోని పలు మండలాల్లో గల ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు ఇ ష్టానుసారంగా ప్రార్థనా సమయానికి పాఠ శాలలకు హజరుకాకపోవడంపై సోమవా రం మన తెలంగాణ విలేకరుల బృందం పా ఠశాలలను విజిట్ చేయగా కొంత మంది ఉపాద్యాయుల నిర్లక్షం బట్టబయలైంది. ‘’ సారోళ్లిలా …మా చదువు సాగేదెలా…?”.అనే కథనం మంగళవారం మన తెలంగాణ దిన పత్రిక లో ప్రచురితమైంది. ఈ కథనం పై స్పంధించిన డిఈఓ సుశీందర్ రావు ప్రార్థనా సమయానికి హాజరు కాని ఉపాధ్యాయులకు మంగళవారం కొందరికి బుధవారం మరికొందరికి డిఈఓ కార్యాలయానికి పిలిపించు కుని మెమోలు జారీ చేశారు. ప్రతి ఎంఈఓ,సిఆర్‌పి, విధిగా రోజుకు ఒక పాఠశాలకు ప్రార్థనా సమయానికి హాజరు కావాలని లేనట్లైతే వారి పై కూడా చర్యలు తప్పవని డిఈఓ హెచ్చరించారు.