Home సినిమా మారాల్సింది మగవాళ్ల ఆలోచనే

మారాల్సింది మగవాళ్ల ఆలోచనే

vidhya-balanబాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ తాజాగా మహిళల డ్రెస్సింగ్‌పై నోరువిప్పింది. ఈమధ్య బాగా హాట్ టాపిక్ అయిన ఈ అంశంపై ఆమె మాట్లాడింది. “మహిళల డ్రెస్సింగ్‌పై మారాల్సింది మగవాళ్ల ఆలోచనే. తమకు నచ్చిన వస్త్రాలను అమ్మాయిలు వేసుకుంటారు. వారికి ఇవ్వాల్సిన గౌరవం డ్రెస్సులను బట్టి ఉండకూడదు. ఓ మహిళ అలా డ్రెస్ చేసుకోవడానికి ఎన్నో పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగం కూడా కారణం కావచ్చు. హీరోయిన్లు అయినా ఎక్స్‌పోజింగ్ చేస్తున్నారని గౌరవం ఇవ్వకుండా ఉంటారా”అని విద్యాబాలన్ ప్రశ్నించింది. “డర్టీ పిక్చర్‌లో నేను చాలా బోల్డ్ క్యారెక్టర్ చేశాను. సినిమాలో నా అందాల ప్రదర్శన శృతి మించింది. అవన్నీ క్యారెక్టర్‌కు అనుగుణంగానే చేశా. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి బ్లాక్‌బస్టర్ హిట్‌ను చేశారు”అని చెప్పింది ఈ బ్యూటీ. దేశంలో ప్రతి చోటా ఈవ్ టీజింగ్ జరుగుతోందన్న విద్యాబాలన్… కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ జరుగుతోంది అంతే అని చెప్పింది. అమ్మాయిలు భయపడకుండా జీవించాలి… అలాగే తమ సొంత కాళ్లపై నిలబడే ఆర్థిక స్వాత్రంత్యం కూడా చాలా ముఖ్యమని హితబోధ చేసింది.