Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

ధ్యానంతోనే మానసిక ప్రశాంతత

mp

ఎంపి బూర నర్సయ్య గౌడ్

బీబీనగర్ : ధ్యానంతోనే   మానసిక ప్రశాంతత లభి స్తుందని భువ నగిరి ఎంపి బూర నర్సయ్య గౌడ్, హై కోర్టు మాజీ న్యాయమూర్తి వంగాల ఈశ్వరయ్య గౌడ్‌లు అన్నారు. మంగళవారం మండలంలోని నెమరుగొముల గ్రామ పరిధిలో గల మహాదేవ్‌పురం శివారులో నూతనంగా నిర్మించిన రాజ యోగ దివ్యాశ్రమం (బ్రహ్మకుమారీస్ సైలేంట్ రిట్రీట్ సెంటర్) ను సంద ర్శి ంచారు.  ఎంపి బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ మానసిక ప్రశాంతత నెల వుగా ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.  ఈ మం దిరంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పుర స్కరించుకొని జ్యోతిర్లింగాల నిజ స్వరూప ప్రదర్శనను దర్శించుకున్నారు. అనంతరం ధ్యాన మందిరానికి సమీ పం లోని అక్కన్న మాదన్న ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహి ంచారు.  ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎంపిని ఘనంగా సన్మానించారు. అన ంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను ఎంపికి  అందజేశారు. ఈ కార్యక్ర మం లో టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఎరుకల సుధాకర్ గౌడ్, గొళి పింగల్ రెడ్డి, వం గాల వెంకన్న గౌడ్, ఆకుల ప్రభాకర్, సర్పంచులు తంతరపళ్లి అంజయ్య గౌడ్, ఎరుకల నర్సింహ్మ గౌడ్,ఇస్తారి, సంకూరి నాగరాజు,ఎంపిటీసిలు మన్నే బాల రాజు, చంద్రశేఖర్,  బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు శేఖర్ గౌడ్,  పాల్గొన్నారు.

Comments

comments