Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

చెత్త కనిపిస్తే చాలు.. తొలగించే పనిలో నిమగ్నం

Srikonda-Kota

బాన్సువాడ: ఇయన పేరు వకీల్.. పుట్టింది బిహార్ రాష్ట్రం… మతిస్థిమితం కోల్పోయి మానసిక రోగిగా గత నెల రోజుల నుండి బాన్సువాడలో కనిపిస్తున్నాడు. వేశాధారణ చూసి పిచ్చోడు అనుకుంటే పొరబాటే. ఇతనిలో కూడా మంచి సుగుణాలు ఉన్నాయి. మన ఇంటి చెత్తను మనం తొలగించుకునేందుకు వెనుకడుగు వేస్తుంటాం…కాని ఇతనికి ఎవరూ చెప్పక పోయినా మురికి నీటిలో చెత్తా చెదారాలు కనిపించినా…అక్కడే వాలి పోతాడు. నిద్రహారాలు మాని అట్టి చెత్తను తొలగించే వరకు విశ్రమించడు. కడుపుకు అన్నం తినడు. ప్రతినిత్యం మురికి కాలువలను అనుసరిస్తూనే తిరుగుతుంటాడు. అది ఎవరిదీ అని చూడకుండా ఎక్కడ చెత్త కనిపిస్తే చాలు..డ్రైనేజీలో చేతులు పెట్టి అట్టి చెత్తను తొలగించడమే కాకుండా నీరు నిలిచి పోకుండా పారే విధంగా పనులు చక్కదిద్దుతాడు.

మానసిక రోగి గా సమాజానికి కనిపిస్తున్నా, ఇతనిలో దాగి ఉన్న మంచితనాన్ని చూసి అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్చా భారత్‌కు ఇతనే సాక్షంగా చెప్పుకోవచ్చునని వ్యాపారులు అంటున్నారు. గత మాసం రోజులుగా బాన్సువాడలో తిరుగుతున్న వకీల్ ప్రధాన రహదారికిరువైపుల ఉన్న డ్రైనేజీలలో పేరుకుపోయిన చెత్తచెదారాలు, ఇతరాత్ర వ్యర్థ పదార్థాలను తీసి ఒడ్డున వేసే పనిలో నిమగ్న మయ్యాడు. రోడ్డు బారుగా షాపుల ముందు రోజంతా కూర్చుండి మురికి కాలువలను శుభ్రం చేస్తూ వారిచ్చే నయానో బయానో తీసుకోకుండా కాసింత అన్నం పెడి తే చాలు అని చేయి చాస్తున్నాడు. పట్టణంలో ని టీచర్స్‌కాలొనీ, చైతన్య కాలొనీ, బోధన్ రోడ్ ప్రాంతాలలో అందరికీ కనిపిస్తూ పారిశు ద్ద నివారణ పనులు పూర్తి చేస్తున్నాడు. పం చాయితీ పాలకులు, సిబ్బందికి పట్టని పారిశుద్ద నివారణకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

తీసిన చెత్తను తొలగించని పంచాయితీ
మురికి కాలువల్లో పేరుకు పోయిన చెత్త చెదారాలను వకీల్ తీసి కుప్పలుగా పోసిన వాటిని తొలగించడంలో పంచాయితీ పాలకులు గాని పారిశుద్ద సిబ్బంది నిర్లక్షం చేస్తున్నారు. అ ట్టి చెత్త కుప్పలు పది రోజులుగా అదే విధంగా పడి ఉన్నాయి. మరి ప్రజారోగ్యం, పారిశుద్ద సమస్య నివారణపై ఎంత శ్రద్ద ఉందో ఇట్టే తెలిసిపోతుంది.

Comments

comments