Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ఐష్‌కు మెరిల్ స్ట్రీప్ అవార్డు

Aishwarya

మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్‌కి  అవార్డులు రివార్డులకు కొదవేం లేదు. కెరీర్‌లో ఎన్నో పురస్కారాలను తన ఖాతాలో వేసుకున్న మేటి కథానాయిక ఆమె. తాజాగా మరో అరుదైన పురస్కారాన్ని దక్కించుకొని టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో శనివారం నిర్వహించిన విప్ట్ (ఉమెన్ ఇన్ ఫిలింస్ అండ్ టెలివిజన్) అవార్డులలో ఐష్‌కు ప్రత్యేకంగా మెరిల్ స్ట్రీప్ పురస్కారం దక్కింది. ఈ అవార్డు అందుకున్న ఏకైక సెలబ్రిటీ ఐశ్వర్యారాయ్. ఈ వేడుకల్లో తన తల్లి బృందారాయ్, కుమార్తె ఆరాధ్యతో కలిసి ఆమె పాల్గొంది. ఈ వేడుకలో శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ ఎమిరాల్డ్ అవార్డు అందుకుంది. ఇక ఐశ్వర్యారాయ్ ఇటీవల ‘ఫనేఖాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా ఆడింది. తన భర్త అభిషేక్ బచ్చన్‌తో ఓ సినిమాలో నటించేందుకు ఆమె సిద్ధమవుతోంది. క్రిష్ 4 సినిమా కోసం ఐష్ పేరు పరిశీలనలో ఉందని తెలిసింది.

Comments

comments