Home సినిమా ఆల్ ది బెస్ట్…

ఆల్ ది బెస్ట్…

PV-Sindhu-and-Srikanth-wit-

హైదరాబాద్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టోర్నమెంట్‌కు సిద్ధమవుతున్న స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, మరో స్టార్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌లను దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కలిశారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫోటోను రాజమౌళి ట్వీట్ చేశారు. ‘ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌కు సిద్ధమవుతున్న సింధు, శ్రీకాంత్‌ను కలిశాను. ఆల్ ది బెస్ట్.. జస్ట్ రాక్ ఇట్’ అంటూ ట్వీట్ చేశారు. రాజమౌళి ట్వీట్‌కు అటూ సినీ అభిమాను ఇటూ క్రీడా అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. ‘స్టార్ ప్లేయర్స్ విత్ స్టార్ డైరెక్టర్’ అంటూ రాజమౌళి అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ఇక ‘బాహుబలి’ వంటి భారీ హిట్ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జక్కన్న తన తదుపరి ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. రాజమౌళి తన తరువాతి చిత్రంగా టాలీవుడ్ స్టార్స్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్ టిఆర్ లతో మల్టీస్టారర్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు గతకొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. క్రీడా నేపథ్యంలో మూవీ ఉండనుందని తెలుస్తోంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే కథ తయారు చేసి తుదిమెరుగులు దిద్దుతున్నారట. అన్నీ కుదిరితే ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమా సెట్ పై తీసుకెళ్లనున్నారని సమాచారం.