Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

మెట్రో ప్రయాణికులకు సకల సౌకర్యాలు

METRO

మన తెలంగాణ/సిటీ బ్యూరో : హైదరాబాద్ మెట్రోరైల్‌లో ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ అన్నారు. ఆదివారం వివిధ శాఖల అధికారులతో కలసి ఆయన నాగోల్-బేగంపేట్ 16 కిలోమీటర్ల పరిధిలో పనులను పరిశీలించారు. పనుల పురొగతిపై మెట్రోరైల్ ఎం.డి.ఎన్‌విఎస్‌రెడ్డి వివరించారు. మధ్య మధ్యలో నిలించిపోయిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. సౌకర్యాలు, ప్రయాణిలకు రక్షణ తదితర అంశాలను పరిశీలించారు. ఫుట్‌పాత్‌ల పునరుద్దరణ, ఉప్పల్ నుంచి పరేడ్‌గ్రౌండ్ వరకు వీధుల వసతులు, గ్రీనరి, తదితర సుందరికరణ పనులు నిర్వహించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. నాగోల్ -బేగంపేట్, మీయాపూర్ – ఎస్‌ఆర్‌నగర్‌ల కారిడార్లలో మెట్రో స్టేషన్ల దగ్గర పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించే పనులు పూర్తి చేశామని వివరించారు. వీధులలో నిర్వహించాల్సిన పనులపై ఇటీవల మునిసిపల్ శాఖమంత్రి కెటిఆర్‌కు వివరించామని ఎంఎయుడి కార్యదర్శి నవీన్‌మిట్టల్ తెలిపారు.

ఇప్పటికే మెట్రోరైల్ నడిపేందుకు ఇప్పటికే రైల్యే శాఖ క్లియరేన్స్ ఇచ్చిందన్నారు. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్‌పిసింగ్ సూచించారు. ఇందుకోసం ఫిడర్‌బస్‌లు, ఎలక్ట్రికల్ వాహనాలు, సైకిల్ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

దీనివల్ల కాలుష్యం కూడా తగ్గించేందుకు అవకాశం ఉంటుందన్నారు. పాదచారుల సౌలభ్యం కోసం స్కైవేలు నిర్మించాలని అన్నారు. బంజారహిల్స్‌లో నిర్మిస్తున్న పోలీస్ కంబైన్డ్ కంట్రోల్ సెంటర్‌కు సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వాలని పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి కోరారు. ఉప్పల్‌లో ఉన్నఆపరేషన్ కంట్రోల్ రూమ్ (ఒసిసి), పోలీస్ కంబైన్డ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలన్నారు. ప్రయాణికుల భద్రత, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు సూచనలు ఇవ్వాలని పోలీసు అధికారులకు ఎస్‌పి.సింగ్ అదేశించారు.

అన్ని శాఖల అధికారులు సమన్వ యంతో మెట్రో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాల న్నారు. మెట్రోరైల్ పనులు చేపట్టేందుకు ఆర్ధిక పరమైన సహకరం అందించాలని ఆర్ధిక శాఖ కార్యదర్శి సునిల్ శర్మను ఆదేశించారు. దేశంలోనే అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్ మెట్రోరైల్‌లో వినియోగిస్తున్నారని తెలిపారు. పనులు పూర్తయిన ప్రాంతాల్లో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి త్వరలోనే ముహుర్తం నిర్ణయిస్తారని తెలిపారు. ఈ సందర్శనలో ఆర్ధిక శాఖ కార్యదర్శి సునిల్‌శర్మ, జిహెచ్‌ఎంసి కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి, కలెక్టర్లు రహుల్‌బొజ్జా, రంఘునందన్‌రావు, ఎల్ అండ్ టి ఎం.డి శివానంద్ నిబార్గీ, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments