Home హైదరాబాద్ గడువు సమీపిస్తున్నా…

గడువు సమీపిస్తున్నా…

Metro construction works on the Snail walk

కారిడార్1లో ఇంకా పూర్తి కాని పనులు
నత్తనడకన సాగుతున్న మెట్రో నిర్మాణ పనులు
ఆగస్టు 15లోపు ప్రారంభించాలని నిర్ధేశం

మన తెలంగాణ/సిటీబ్యూరో : కారిడార్1లో మెట్రో నిర్మాణ ప నులు ఇంకా పూర్తి కాలేదు. అమీర్‌పేట్‌ఎల్బీనగర్ 16 కిలోమీటర్లు వరకు ఉన్న ఈ మా ర్గంలో నత్తనడకన పనులు కొనసాగుతున్నా యి. 16 కిలోమీటర్లకు గానూ ఈ రూట్‌లో 16 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. మెట్రో అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం అమీర్‌పేట్‌ఎల్బీనగర్ మార్గాన్ని ఆగస్టు 15 లోపు ప్రారంభించాలని భావిస్తున్నారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుని ఆహ్వానిస్తున్నట్లు తెలిసింది. గతంలోనూ ఇదే విషయాన్ని సమాచార, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు కూడా. గడవు సమీపిస్తున్నప్పటికినీ పనులు అసంపూర్తిగానే కొనసాగుతున్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌లోని మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్‌కు వెళ్లే మార్గంలో ఫుట్‌పాత్ నిర్మాణ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి.

ఎల్బీనగర్ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్లే మార్గంలో కుడివైపునా ఉండే పాదచారులు నడిచే బాటలో టైల్స్ పనులు సాగుతున్నాయి. ఎడమవై పు ఉన్న ఫుట్‌పాత్ నిర్మాణ పనులు కొద్ది మేరకు పూర్తైనాయి. కానీ కుడివైపున కా లేదు. రోడ్డుకి ఇరువైపులా తవ్వి వదిలేశా రు. కొన్ని చోట్ల పనులు నడుస్తుంటే మరికొన్ని చోట్ల చేపట్టడం లేదు. ఈ ఒక్క స్టే షన్ సమీపంలోనే కాదు మిగతా స్టేషన్‌ల వద్ద సైతం పాదచారుల నడిచే రహదారి పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. నిర్మాణ పనుల కోసం రోడ్డుకు ఇరువైపులా మట్టిని తవ్వి వదిలారు. షాపింగ్‌కు వచ్చే వినియోగదారులు దీంతో ఇబ్బందులు పడుతున్నారు. షాపు ఎదురుగా వాహనాలు పార్క్ చేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. ప్రారంభ గడువు సమీపిస్తుండటంతో పనలను వేగం పెంచినట్లు తెలుస్తోంది. కానీ ఈ పెండింగ్ పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయో లేదో మరి అధికారులకే తెలియాలి.