Home రాష్ట్ర వార్తలు మెట్రోకి స్రుల్తాన్‌బజార్ జీహుజూర్

మెట్రోకి స్రుల్తాన్‌బజార్ జీహుజూర్

sddsdffఆస్తులు ఇచ్చేందుకు సుల్తాన్‌బజార్ బడిచౌడీ  వాసుల అంగీకారం, అవతరించనున్న   ప్యారడైజ్ హబ్, పుత్లీబౌలిలో 80 షాపుల   కేటాయింపు, 100 మంది  వీధి వ్యాపారులకు చోటు

సిటీబ్యూరో : మెట్రోరైల్ నిర్మాణానికి తమ ఆస్తులు ఇచ్చేందు కు సుల్తాన్ బజార్, బడిచౌడీ చెందిన వ్వాపా రులు అంగీకరం తెలిపారు. సుదీర్ఘకాలంగా భూసేకరణ సమస్య అపరిష్కృతంగా ఉన్న సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. బడిచౌడీ, సుల్తాన్ బజార్‌లలో భూసేకరణ ప్రత్యేక కేసుగా పరిగణించి రెండింతల నష్టపరిహారం ఇవ్వను న్నారు. పుత్లీబౌలిలో నిర్మిస్తున్న సుల్తాన్ బజార్ హబ్‌లో వ్యాపారులు, వీధివ్యాపారులకు డిపాజి ట్ లేకుండా దుకాణాలు ఇచ్చేందుకు మెట్రో అధికారులు ముందుకు వచ్చారు. సుల్తాన్‌బజా ర్ బాటా చౌరస్తా నుంచి ఆంధ్రా బ్యాంక్ వరకు ప్యారడైజ్‌గా అభివృద్ధి చేయనున్నారు. వయోడ క్ట్ కింద వీధి వ్యాపారు లకు ఎలాంటి డిపాజిట్ లేకుండానే దుకాణాలు ఇవ్వనున్నారు. శుక్రవా రం బడి చౌడీ, సుల్తాన్ బజార్ భవన యజ మానులు, వ్యాపారు లతో మెట్రో భవన్‌లో చర్చలు జరిగాయి. ఈ చర్చలు సఫలం కావ డంతో భూ సేకరణలో నష్టపోయే వారితో పాటు వీధి వ్యాపారులకు తగిన విధంగా న్యాయం చేస్తామని హైదరాబాద్ మెట్రోరైల్ ఎం.డి. ఎన్‌విఎస్ రెడ్డి హామీ పత్రం అందజేశా రు. మెట్రోరైల్ నిర్మాణానికి తమవంతు సహకా రం అందిస్తామని యజమా నులు, వ్యాపారులు కూడా మెట్రో అధికారులకు హామీనిచ్చారు. బడిచౌడీ, సుల్తాన్ బజార్‌ల భూసేకరణ అంశా న్ని ప్రత్యేక కేసుగా పరిశీలించాని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తమను ఆదేశించారని ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు. ఎవరికి ఎలాంటి నష్టం లేకుండా పూర్తిస్థాయిలో ఉపాధి కల్పిం చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్ మెట్రోరైల్ కారి డార్-2 పరిధిలో భూసేకరణకు బడిచౌడీ, సుల్తాన్ బంజార్ మార్గంలో కిలోమీటర్ పరిధిలో భవన యజమానులు, వ్యాపారుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. పలు పర్యాయాలు ప్రభుత్వం తరపున మెట్రో అధికా రులు భవన యజమానులు, వ్యాపారులతో చర్చలు జరిపారు. అయితే ప్ర త్యేక ప్యాకేజి ప్రకటించడంతో భవన యజమానులు, వ్వాపారులు భూసేక రణుకు అంగీకరించారు. కాచిగూడ నుంచి బడిచౌడీ వరకు 80 అడుగుల వరకు విస్తరిస్తారు. బాటా చౌరస్తా నుంచి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా వరకు కేవలం 65 అడుగుల వరకు మాత్రమే భూసేకరణ జరుపుతారు. ఆంధ్రా బ్యాంక్ చౌరస్తా నుంచి పుత్లీబౌలి వరకు 80 అడుగుల వరకు విస్తరణ జ రుపుతారు. సుల్తాన్ బంజార్‌లో మెట్రో వయోడక్ట్ కింద 250 అడుగుల వరకు వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా ప్యారడైజ్ హాబ్‌ను అభివృద్ది చేస్తామని మెట్రో అధికారులు హామీనిచ్చారు. ఇందుకోసం ప్రత్యేకమైన ఫ్లాట్‌ఫరమ్ నిర్మించనున్నారు. ఐదు క్యారేజ్‌వేలు ఉంటాయి. కేవలం పాద చారులు, వినియోగదారులు వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తారు. అంత ర్జాతీయ స్థాయిలో అభివృద్ది చేసేందుకు హెచ్‌ఎంఆర్ అధికారులు ఇందు కోసం రూ.2 కోట్లు వ్యయం చేయనున్నారు. వ్వాపారులకు పునరవాసం కల్పించేందుకు పుత్లీబౌలిలో ఇప్పటికే రూ.13 కోట్ల వ్యయంతో ఐదు అంతస్తుల భవనం నిర్మించారు. ఈ భవనానికి మెట్రోరైల్ కారిడార్-1, 2లను అనుసంధానం చేస్తారు. రెండు, మూడు అంతస్తుల్లో ఈ సౌకర్యం ఉంటుంది. ఈ భవనంలో 80 మందికి షాపులు కేటాయిస్తారు. మరో 100 మంది వీధి వ్వాపారులకు ఇరువైపుల ర్యాంప్‌ల ద్వారా దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. ఈ భవనాన్ని అత్యధునిక పరిజ్ఙానంతో నిర్మించారు. అగ్నిమాపక చర్యలతో పాటు, అడు గడుగున సిసిటివి కెమోరాలతో రక్షణ చర్యలు చేపట్టనున్నారు. భవన యజమానులతో పాటు ఉపాధి కోల్పోయే వ్యాపారులకు కూడా నష్ట పరిహారం ఇవ్వనున్నారు. తమకు మెరుగైన నష్టపరిహారం ఇచ్చేందుకు అంగీకరించినందుకు భవన యజమానులు, వ్యాపారులు ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు నాయిని నర్సింహ్మరెడ్డి, మెట్రో ఎం.డి ఎన్‌విఎస్‌రె డ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. మెట్రో నిర్మాణం సాఫిగా జరిగేందుకు సహ కరిస్తామని హామీనిచ్చారు. సుల్తాన్ బంజార్, బడిచౌడీలలో భూసేకరణ సమస్య పరిష్కారం కావడంతో మెట్రో అధికారులు కూడా హర్షం వ్యక్తం చేశారు. చర్చల్లో పాల్గొన్న వారిలో మాజీమంత్రి పి.రామస్వామి, సుల్తాన్ బంజార్ ట్రేడర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు గోవింద్‌రాఠీ, వి.కిషన్‌యాదవ్, మనోహర్ సూర్యవంశీ, శివకుమార్ కచ్‌వా, శ్రీనివాస్ సొని, అలమ్‌ఖాన్, వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు.