Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో మెట్రో రైలు ఆపరేటర్ మృతి…

రోడ్డు ప్రమాదంలో మెట్రో రైలు ఆపరేటర్ మృతి…

Metro Rail Operator

 

విధులకు హాజరయ్యేందుకు వెళ్తూ.. మృత్యువాతపడ్డ నసీర్

కూకట్‌పల్లి: ద్విచక్ర వాహనాన్ని వేగంగా నడుపుతూ లారీని ఢీ-కొట్టిన ఘటనలో ఓ యవకుడు మృతి చెందిన సంఘటన శనివారం కూకట్‌పల్లి పోలీస్ సేష్టన్ పరధిలో చేటు చేసుకుంది. కూకట్‌పల్లి ఎస్సై రమేష్ , ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ప్రగతినగర్ రాజీవ్ గృహకల్పకు చెందిన షేక్ నసీర్(26) మెట్రో రైల్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తాడు. శనివారం ఉదయం తన నివాసం నుంచి గం.5.30 ని. అమీర్‌పేటలో విధులకు హాజరైయ్యేందుకు (ఎపి07-సియు 1553) గ్లామర్ బైక్ పై బయలుదేరి వెళ్లాడు. కూకట్‌పల్లి బిజెపి కార్యాలయం సమీపంలో తన బైక్‌పై అతి వేగంగా ప్రయాణిస్తూ ముందు వెళ్తున్న లారీని ఢీ-కొట్టడంతో అదుపుతప్పి రోడ్డుపై పడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. నాగోల్ మెట్రో కంట్రోల్ రూం సిబ్బంది నసీర్ కుటుంబ సభ్యులకు, ఘటనా స్ధలంలో ఉన్న ప్రయాణికులు స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నసీర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 

Metro Rail Operator Dies In Road Accident