Search
Saturday 17 November 2018
  • :
  • :

మెట్రో రైలుపై కోటి ఆశలు…

metro-trainమెదక్: రామచంద్రాపురం పట్టణ వాసులు మెట్రో రైలు కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో స్థానిక ప్రజా ప్రతినిధులు మెట్రో రైలును పొడిగించేందుకు హామీలు ఇవ్వడంతో కోటి ఆశలు పెంచుకున్నారు. లింగంపల్లి నుంచి రామచంద్రాపురం పట్టణం వరకు ఇప్పటికే ఎంఎంటిఎస్ పనులను జరుగుతున్నాయి. దీనికి తోడు మెట్రో కూడా వస్తే పట్టణ వాసులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. రామచంద్రాపురం పట్టణంతో పాటు పటాన్‌చెరు పారిశ్రామికవాడ నుంచి రోజు లక్షలాది మంది విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు నగర ప్రాంతానికి రాకపోకలు సాగిస్తుంటారు. ఎక్కువ మంది కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు బస్సుల్లో, వాహనాలపై నగరంకు వెళ్తుంటారు. దీంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలతో వారు కొట్టుమిట్టాడుతుంటారు. గమ్యానికి అనుకున్న సమయానికన్నా ఆలస్యంగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొంతమంది ట్రాఫిక్‌లో ప్రయాణం లేక సుమారు 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో వాహనాన్ని పెట్టి ఎంఎంటిఎస్‌లో రాకపోకలు సాగిస్తున్నారు. దాంతో ప్రతినెల జేబులను చిల్లు చేసుకునే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు గత కొంతకాలంగా స్థానిక ప్రజా ప్రతినిధులు మెట్రో రైలును ఎట్టి పరిస్థితిల్లో పటాన్‌చెరు వరకు తెస్తామని చెప్పడంతో ఇక్కడ ప్రజల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. మెట్రో రైలు వస్తే జాతీయ రహదారిపై రద్దీ తప్పడంతో పాటు సుఖవంతమైన ప్రయాణం చేయవచ్చు. అనుకున్న సమయానికాన్న ముందుగానే వెళ్లే పరిస్థితి ఉంటుంది. దాంతో ప్రజలు ఎంఎంటిఎస్ రైలు కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపిస్తే మరింత బాగుంటుందని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.

Comments

comments