Search
Sunday 23 September 2018
  • :
  • :

అద్దిరిపోయే ఆఫర్లతో ఎంఐ దివాళీ ఫ్లాష్ సేల్!

Diwali-With-MI

న్యూఢిల్లీ : అత్యంత చౌక ధరలకే అద్దిరిపోయే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు వినియోగదారులకు అందిస్తున్న చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ షియోమి మొబైల్ ప్రియులకి మరో కళ్లు చెదిరిపోయే ఆఫర్ ని ప్రకటించింది. వచ్చే నెలలో వస్తున్న దీపావళి పండుగ సందర్భంగా సందర్భంగా ఈ నెల 27, 28, 29 తేదీల్లో కేవలం రూ.1కే స్మార్ట్ ఫోన్ ని అందిస్తున్నట్లు షియోమి అధికారిక వెబ్ సైట్ లో ప్రకటించింది. ఆ మూడు రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ రూ.1 ఫ్లాష్‌ సేల్‌ నిర్వహించనుంది. ఇందులో రెడ్‌మీ నోట్ 4, ఎంఐ రూటర్ 3సి, రెడ్‌మీ 4, ఎంఐ బ్లూటూత్ మినీ స్పీకర్, ఎంఐ సెల్ఫీ స్టిక్, రెడ్‌మీ 4ఎ, ఎంఐ బ్యాండ్ హెచ్‌ఆర్‌ఎక్స్ ఎడిషన్, ఎంఐ క్యాప్సూల్ ఇయర్‌ఫోన్స్, ఎంఐ వైఫై రిపీటర్, ఎంఐ బ్యాక్‌ప్యాక్, ఎంఐ విఆర్ ప్లేలు కేవలం 1 రూపాయికే పొందే అవకాశం ఉంది. అంతేకాక పలు స్మార్ట్ ఫోన్లు, ఇతర అలాగే ఈ సేల్ సందర్భంగా షియోమీ ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై భారీ రాయితీలను అందివ్వనున్నారు. ఎస్‌బిఐ క్రెడిట్‌ కార్డుదారులకు అదనంగా 5శాతం క్యాష్‌ బ్యాక్‌ను, రూ.8000 కంటే ఎక్కువ కొనుగోలు చేసిన వినియోగదారులకు ఒక్కో కార్డుకు రూ.500 వరకు క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది.

Comments

comments