Home అంతర్జాతీయ వార్తలు మైకేల్ జాక్సన్ తండ్రి కన్నుమూత

మైకేల్ జాక్సన్ తండ్రి కన్నుమూత

Michael Jackson's Father Passed Away

ప్రముఖ పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ తండ్రి జోయ్ జాక్సన్(89) బుధవారం సాయంత్రం కన్నుమూసినట్టు ఆయన మనవళ్లు రాండీ జాక్సన్ జూనియర్, టై జాక్సన్‌లు తెలిపారు. కొంతకాలంగా ఆయన పాంక్రియాటిక్ కేన్సర్‌తో బాధపడుతూ ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. మైకేల్ జాక్సన్‌కి మేనేజర్‌గా వ్యవహరిస్తూ పాప్ రంగంలో ఆయన ఎదుగుదలకు జోయ్ ఎంతగానో కృషి చేశారు. జోయ్ మృతిపై పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు. జోయ్ జాక్సన్ 1928 జులై 26న అమెరికాలో జన్మించారు. ఆయన భార్య పేరు కేథరిన్ (88). వీరికి 10 మంది సంతానం ఉన్నారు. మైకేల్ జాక్సన్ వీరికి ఎనిమిదో సంతానంగా జన్మించారు. జోయ్ చిన్న కూతురు జానెట్ జాక్సన్ (52) కూడా పాప్ సింగరే. జోయ్ ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు. జోయ్ కొడుకు అయిన మైకేల్ జాక్సన్ (50) 2009, జూన్ 25న గుండెపోటుతో కన్నుమూసిన విషయం విదితమే.

Michael Jackson’s Father Passed Away