Search
Monday 24 September 2018
  • :
  • :

తక్కువ ధరకే ట్యాబ్లెట్ పిసిలు : మైక్రోసాప్ట్

pc

ముంబయి: సాప్ట్ వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాప్ట్ తన వినియోగదారులకు శుభవార్త వినిపించింది. తక్కువ ధర కలిగిన ట్యాబ్లెట్ పిసిలను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఇంతకు ముందే వచ్చిన సర్ఫేస్ సిరీస్ లో ఈ నూతన లో కాస్ట్ ట్యాబ్లెట్ పిసిలు రిలీజ్ కానున్నాయి. ప్రత్యేకంగా విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వీటిని తయారు చేస్తున్నట్టు మైక్రోసాప్ట్ స్పష్టం చేసింది.  మైక్రోసాప్ట్ లాంచ్ చేయనున్న లో కాస్ట్ ట్యాబ్లెట్ పిసి లను యాపిల్ ఐప్యాడ్ లకు దీటుగా అందించనున్నట్టు తెలిసింది. ఈ పిసిల్లో 10 ఇంచ్ డిస్ ప్లే, యుఎస్ బి టైప్ సి కనెక్టివిటీ, ఇంటెల్ ప్రాసెసర్, గ్రాఫిక్ కార్డ్స్, 64/128 జిబి స్టోరేజ్, ఎల్ టిఇ కనెక్టివిటీ, తదితర ఫీచర్లను ఏర్పాటు చేస్తున్నట్టు మైక్రోసాప్ట్ వెల్లడించింది. ఇక ఈ పిసిలు ఇతర సర్పేస్ ట్యాబ్లెట్ల కన్నా తక్కవ బరువు ఉంటాయని తెలిపింది. ఈ ట్యాబ్లెట్ ను జూన్ లేదా జూలై లో మైక్రోసాప్ట్ సంస్థ విడుదల చేసే అవకాశం ఉంది.

Comments

comments