Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

మళ్లీ షేర్లు అమ్మేసిన సత్య నాదెళ్ల

Microsoft shares jumped 53 percent last year

3.5 కోట్ల డాలర్ల లాభాల స్వీకరణ
షేరు గరిష్ఠ ధరకు దరిదాపులో అమ్మకం

వాషింగ్టన్: భారత సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌లో తనకున్న షేర్లలో మూడింట ఒకటో వంతును అమ్మేసి 3.5 కోట్ల అమెరికా డాలర్లను సొమ్ము చేసుకున్నాడు. ఆయన అమ్మిన 3,28,000 షేర్ల విలువ ఒక్కోటి 109.08 నుంచి 109.68 మధ్య ఉంది. అంతేకాక ఆయన రికార్డు స్థాయి దరిదాపు ధరలో తన వాటాలు అమ్మాడు. ఈ విషయాన్ని శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ షేర్లు గత ఏడాది 53 శాతం పెరిగాయి. ఈ వారం ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీ షేరు 109 డాలర్ల వద్ద ముగిసింది. అంతేకాక జూలై 25న గరిష్ఠ ధర 110.83 డాలర్లను తాకింది.

మైక్రోసాఫ్ట్ సిఇఒగా 2014లో బాధ్యతలు స్వీకరించిన నాదెళ్ల తన వాటాలను విక్రయించడం ఇది రెండోసారి. 2016లో ఆయన తన వాటాలను అమ్మా రు. అప్పుడు షేరు ఒక్కింటి ధర 58 డాలర్లుగా ఉంది. స్టాక్ అమ్మకాల నివేదిక ప్రకారం ఆయన దగ్గర ఇంకా 7,78,596 షేర్లు ఉన్నాయి. 2017లో ఆయన మూల వేతనం 10 లక్షల 45 వేల డాలర్లు ఉంది. నియమం ప్రకారం మైక్రోసాఫ్ట్ కంపెనీలో తన మూల వేతనం కన్నా 15 రెట్లు ఎక్కువ వాటాలు ఆయన కలిగి ఉం డాల్సి ఉంటుంది. 2014 ఫిబ్రవరిలో స్టీవ్ బాల్మెర్ స్థానంలో సిఇఒగా నాదెళ్ల బాధ్యతలు తీసుకున్నాక సియాటెల్‌కు చెందిన మైక్రోసాఫ్ట్ కంపెనీ షేర్ల విలువ మూడు రెట్లు పెరిగింది.

Comments

comments