Home జాతీయ వార్తలు స్కీం వర్కర్స్ ఇఎస్‌ఐ సేవలు దత్తాత్రేయ

స్కీం వర్కర్స్ ఇఎస్‌ఐ సేవలు దత్తాత్రేయ

Bandaru-Dattatreyaమన తెలంగాణ/ హైదరాబాద్: ఆశా, అంగన్‌వాడీ, మిడ్‌డే మీల్స్ స్కీంలలో పని చేసే కార్మికులకు ఇఎస్‌ఐ సేవలను వర్తింపజేయాలని నిర్ణయించినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఇఎస్‌ఐసి ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం ఇఎస్‌ఐసి ఉన్నతస్థాయి సలహా మండలి సమావేశం జరిగింది.  దత్తాత్రే య పాల్గొని సమావేశం నిర్ణయాలను వెల్లడించారు. సమావేశంలో సలహామండలి చైర్మన్ బ్రిజ్ కిషోర్, సభ్య కార్యద ర్శి జి.వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్ డాక్టర్ ఆర్.కె.కటారియా, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ, సంఘటిత కార్మికులతో పాటు అసంఘటిత కార్మికులకు ఇఎస్‌ఐ సేవలను వర్తింపజేయాలని గతంలోనే నిర్ణయించామని, ప్రస్తుతం వివిధ ప్రభుత్వ పథకాల్లో పని చేసే వారికి వర్తింపజేయాలని నిర్ణయించామని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులకు ఇఎస్‌ఐ సేవల వర్తింపు కోసం వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ (ఎన్‌ఎబిహెచ్) సర్టిఫికేట్‌ను ఇఎస్‌ఐ హాస్పి టల్స్ కు వచ్చేలా చర్యలు తీసుకోనున్నామన్నారు. సలహా మండలి ఇఎస్‌ఐసిపై ఆరు నెలల్లో శ్వేతపత్రాన్ని కార్మిక శాఖకు నివే దిస్తుందని పేషెంట్ మేనేజ్‌మెంట్, పేషెంట్స్ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని సనత్‌నగర్ ఇఎస్‌ఐసి ఆసుపత్రిలో తొలుత ప్రయో గాత్మకంగా చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.