Search
Sunday 18 November 2018
  • :
  • :

మిడ్ మానేరూ. 250 కోట్లు

 ముంపు గ్రామాల పునరావాసానికి విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం            

  రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తిచేయాలని సంకల్పం  

అధికారులతో విడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రాజెక్టుపై సమీక్ష చేసిన మంత్రులు హరీశ్, కెటిఆర్

Mid-maneru

మన తెలంగాణ / హైదరాబాద్
కరీంనగర్ జిల్లాలోని మిడ్‌మానేరు రిజర్వాయర్ ముంపు గ్రామాల పునరా వాసం కోసం రూ.250 కోట్లను అదనంగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. ముంపు బాధితుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించిన నేపధ్యంలో నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, ఐటి, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి కె.తారకరామారావు మిడ్‌మానేరు రిజర్వా యర్ ప్రాజెక్ట్ పనులపై సచివాలయం నుండి విడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. రిజర్వాయర్ ప్రాజెక్ట్ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని వారు సంబంధిత అధికారులను ఆదేశించారు. కరీంనగర్ ఎంపి బి.వినోద్‌కుమార్‌తో పాటు ఆర్ధిక శాఖ డిపార్ట్‌మెంట్ స్పెషల్ సెక్రటరీ ప్రదీ ప్‌చంద్ర, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి, కమిషనర్ ఆర్ అండ్ ఆర్ మానిక్ రాజ్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతు ప్రసాద్, జాయింట్ కలెక్టర్ పౌసుమి బసు, ఇఎన్‌సీ మురళీధర్‌రావు, కరీంనగర్ సిఇ అనిల్ కుమార్, స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ శాఖ ఒఎస్‌డి శ్రీధర్‌రావు దేశ్‌పాండే ఈ సమావేశంలో పాల్గొన్నారు. మిడ్‌మానేరు రిజర్వాయర్ అనేది ఫ్లడ్ ఫ్లో కెనాల్‌కు, ప్రాణిహత ప్రాజెక్ట్, ఎఆర్‌ఎస్‌పిలకు ప్రాణం లాంటిదని మంత్రి హరీష్‌రావు ఈ సందర్భంగా అధికారులకు ప్రాముఖ్యతను తెలియజేశారు. ముంపు గ్రా మాల ఇండ్లు తదితర కట్టడాల విలువ తరుగుదల 35 శాతానికి పరిమితం చేయాలని నిర్ణయించారు. గతంలో ఇచ్చిన నష్టపరిహారం కంటె తక్కువ కా కుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులు ఇద్దరు అధికారులను ఆదేశిం చారు. మిడ్‌మానేరు రిజర్వాయర్ భూసేకరణ, పునరావాసం కోసం 250 కోట్లు అదనంగా కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ నిర్ణ యాన్ని ఆర్థిక శాఖ కూడా సూత్రప్రాయంగా అంగీకరించిందని వారు వెల్ల డించారు. ఈ ఏడాది జనవరి ఒకటవ తేదీ నాటికి పద్దెనిమిది సంవత్సరా లు దాటిన యంయంఆర్ బాధితులకు రూ.2 లక్షల నష్టపరిహారం ఇవ్వా లని నిర్ణయం తీసుకున్నారు.

గ్రామీణ ఉపాధి పథకం కింద వంద రోజుల పని దినాలకు గాను రోజుకు వంద రూపాయల నుంచి 180 రూపాయ లను పెంచాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. ముంపు గ్రా మాల పునరావాస కేంద్రాలకు త్రీ ఫేస్ కరెంట్‌ను ఇవ్వాలని సూచించారు. సిరిసిల్లాలోని సుమారు 423 ఎకరాల అర్బన్ భూములను జీవో 123 ప్ర కారం కొనుగోలు చేయాలని సమావేశం నిర్ణయంచింది. రైతులతో వెంట నే సంప్రదింపులు ప్రారంభించాలని కలెక్టరును మంత్రులు ఆదేశించారు. యంయంఆర్ పరిధిలోని గోపాల్‌రావుపేటలోని 32 ఇళ్ళకు పరిహారం ఇ వ్వాలని అధికారులకు తెలిపారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయా లను అక్టోబర్ 31 లోపు అమలు చేయాలని అధికారులకు మంత్రులు ఆదేశించారు.

Comments

comments