Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

మధ్యాహ్న భోజనం బిల్లులు బంద్?

నాలుగు నెలలుగా రాని జీతాలు
అప్పుసొప్పు చేసి పిల్లల పొట్ట నింపుతున్న ఆయాలు
అంగన్‌వాడీలు ఆగమాగం
మంజూరు కాని బిల్లులు
పట్టించుకోని సంబంధిత అధికారులు, కన్నెత్తి చూడని ప్రజాప్రతినిధులు

అంగన్‌వాడీల నిర్వహణ ఆగమాగమవుతోంది. సవాలక్ష నిబంధనలు పెట్టి అంగన్‌వాడీలు సక్రమంగా సాగాలని చెబుతున్న అధికారులు సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో ఏజన్సీలు డీలపడుతున్నాయి. అప్పుసొపో్పు చేసి పిల్లల పొట్ట నింపుతున్నారు. నాలుగు నెలలుగా జీతాలు రాక ఆయాలు ఆగమాగవుతున్నారు. ప్రస్తుతం నోట్ల రద్దు వ్యవహారం వారిని మరింత ఇబ్బందికి గురి చేస్తోంది. చేతిలో చిల్లిగవ్వ లేక అప్పు చేద్దామంటే కొత్త నోట్లు దొరకక అంగన్‌వాడీల నిర్వహణ అష్టకష్టాల పాలవుతోంది. పిల్లలకు సకాలంలో పౌష్టికాహారం అందించడం ఇబ్బందిగా మారుతోంది. దీంతో అంగన్‌వాడీల కార్యకర్తలు లబోదిబోమంటున్నారు. సకాలంలో బిల్లులుచెల్లించినట్లైతే అంగన్‌వాడీలను సక్రమంగా నడిపే అవకాశం ఉంటుందని వారంటున్నారు. నాలుగు నెలలుగా బిల్లులు రాక కిరాణ షాపులో అప్పులు చేశామని ఏజన్సీలు పేర్కొంటున్నాయి. ప్రతి రోజు తనిఖీలతో బెంబేలెత్తిస్తున్నారు కానీ సకాలంలో బిల్లులు మంజూరు చేయడంపై ఎందుకింత నిర్లక్షం చేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.

Mid-day-Meal1మన తెలంగాణ/బాన్సువాడ డివిజన్: అంగన్‌వాడీల నిర్వహణ ఆగమాగమవుతుంది. సవా లక్ష నిబంధనలు పెట్టి అంగన్‌వాడీలు సక్రమంగా సాగాలని చెబుతున్న అధికారులు సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో ఏజన్సీలు డీల పడుతున్నారు. అప్పు సొప్పు చేసి పిల్లల పొట్ట నింపుతున్నారు. నాలుగు నెలలుగా జీతాలు రాక ఆలయాలు ఆగమాగవుతున్నారు. ప్రస్తుతం నోట్ల రద్దు వ్యవహారం వారిని మరింత ఇబ్బంది పెడుతోంది. చేతిలో చిల్లిగవ్వ లేక అప్పు చేద్దామంటే కొత్త నోట్లు దొరకక అంగన్‌వాడిల నిర్వహాణ అష్టకష్టాల పాలవుతుంది. పిల్లలకు సకాలంలో పౌష్టికాహారం అందించడం ఇబ్బందిగా మారుతుంది.

ప్రతి రోజు దిన దిన గండంగా గడుస్తుందని అంగన్‌వాడిల కార్యకర్తలు లబోదిబోమంటున్నారు. సకాలంలో బిల్లులుచెల్లించినట్లైతే అంగన్‌వాడిలను సక్రమంగా నడిపే అవకాశం ఉంటుందని వారంటున్నారు. నాలుగు నెలలుగా బిల్లులు రాక కిరాణ షాపులో అప్పులు చేశామని ఏజన్సీలు పేర్కొంటున్నారు. ప్రతి రోజు తనిఖీలతో బెంబేలెత్తిస్తున్నారు కానీ సకాలంలో బిల్లులు మంజూరు చేయడంపై ఎందుకు నిర్లక్షం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. గత నాలుగు నెలలుగా ఏజన్సీలలో ఈ పథకం కింద పని చేస్తున్న వారికి నాలుగు నెలలుగా జీతాలు రాలేదు. ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున అరకోర వేతాన్ని అందిస్తున్నారు.

అది కూడా సకాలంలో రాకపోవడంతో పగటి బువ్వ పెట్టేందుకు నిరాసకత చూపుతున్నారు. పిల్లల ఆకలి చూడలేక చేతికి పని ఫలితం అందలేక అంగన్‌వాడిల్లో పని చేసే సిబ్బంది తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బాన్సువాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో అంగన్‌వాడి కేంద్రాలు అరకోరగ నడుస్తున్నాయి. కొన్ని కేంద్రాల్లో నిత్యవసర సరుకులు ఉన్న వాటిని తయారు చేసే మనుషులకు వేతనాలుఅందలేదు. మరికొన్ని చోట్ల డబ్బులు రాక నిత్యవసర సరుకులు లేక అప్పు సొప్పు చేసి కేంద్రాలు నడపాల్సిన పరిసిథి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో అంగన్‌వాడిలు అపరిశుభ్రత లోపంతో పారిశుద్య సమస్య ఏర్పడింది.

బాన్సువాడ రెవెన్యూ డివిజన్‌లో..
బాన్సువాడ డివిజన్‌లో ప్రధానంగా 197 అంగన్‌వాడి కేంద్రాలుకొనసాగుతుండగ, 28 ప్రాథమికంగా కేంద్రాలు నడుస్తున్నాయి. మొత్తం గర్బీణీలకు 1561 మంది ఉండగ బాలింతలు 1708 మంది అంగన్‌వాడి కేంద్రాల్లో ఆహారాన్నీ స్వీకరిస్తున్నారు. అదే విధంగా 17 వేల 455 మంది పిల్లలు అంగన్‌వాడి కేంద్రాల్లో మధ్యాహ్న భోజనాన్ని ఆరగిస్తున్నట్లు రికార్డులు తెలుపుతున్నాయి. ప్రతి కేంద్రంలో మధ్యాహ్న భోజనం అమలవుతున్నట్లు బాన్సువాడ అనురాధ తెలిపారు. అయితే కొన్ని రోజులుగా అంగన్‌వాడి కేంద్రాల్లో పని చేస్తున్న మధ్యాహ్న భోజనం వర్కర్లకు వేతనాలు రాని మాట వాస్తవమేనని కొన్ని కారణాల వల్ల వారికి రావాల్సిన డబ్బు మంజూరుకాలేదన్నారు. త్వరలోనే బిల్లుల మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయని ఐసిడిఎస్ అధికారులు కొందరు మన తెలంగాణకు చెప్పారు. 424 మంది గర్బవతులుండగా, 418 బాలింతలు, 4884 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని స్వీకరిస్తున్నారు.

ఈ పథకం ఎలా అమలైందంటే
పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్నం పూట భోజన పథకం అమలు చేయడం హర్షనీయం. పేద బాల, బాలికలకు మధ్యాహ్నం పూట కడుపునిండా తిండి పెట్టడంతో పాటు విద్యను అందించాలన్న ఉద్దేశంతో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పథకాన్ని 1995లో అమలుచేశారు. అన్నీ పని దినాల్లో పిల్లలకు ఉచితంగా బోజనం పెట్టే అవకాశం కల్పించారు. దీంతో బడిలో చేరే వారి సంఖ్య పెరగడమే కాకుండా పాఠశాలలో హాజరు శాతం పెరిగే అవకాశం ఉంటుందని సామాజిక సమ భావన పెంచడంతో పాటు పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం. ఈ పథక ముఖ్య లక్షం.

నాలుగు నెలలుగా జీతాలు రాలేదు : గంగవ్వ
నాలుగు నెలల నుంచి పనులుచేస్తున్న రూపాయి రాలేదు. ప్రతి నెల ఇగో అగో అంటున్నారు. ఇప్పుడేమో పాత నోట్ల నడవయి. పెద్ద నోట్లు ఇస్తమంటున్నారు.మేమెక్కడికి పోవల ఎట్ల చిల్లర చేసుకోవాల. పిల్లలను చూస్తే జాలేస్తుంది. అక్కడక్కడ అప్పు చేసి పగటి బువ్వ పెడుతున్నం. అధికారులకు తెలియద అందరు వచ్చి చెప్పెటోల్లే కానీఎవరైన జీతాల గురించి మాట్లాడే వారు ఉన్నార అంటూతాడ్కోల్ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో పని చేస్తున్న గంగవ్వ ఆందోళన వ్యక్తం చేసింది.

పిల్లలకు పెట్టి పస్తులుంటున్నం : కమల
పిల్లలకు పగటిపూట బువ్వ పెట్టి జీతాలు రాక తాము పస్తులుంటు న్నామని కమల ఆవేధన వ్యక్తం చేసింది. గత నాలుగు నెలల నుం చి రూపాయి జీతం అందలేదని ఆందోళన చెందింది. రెండు నెలు లగా అధికారులను అడుగుతున్న అగో ఇగో అంటు న్నారేకానీ తీసుకోమన్న వారు లేకుండాపోయారని వాపోయింది. నాలుగు నెలల నుంచి వేతనాలు రాక అప్పు సొప్పు చేసి కాలం వెళ్లుదీస్తు న్నామని పేర్కొంది. ఈ పనికన్న వేరే పని చేసిన చేతికి డబ్బులు వచ్చేటివి, పిల్లల కడుపు నింపాలన్న మంచి ఆలోచనతో పని చేస్తే పైస రావాడం లేదు.

Comments

comments