Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన ఆక్రమాలకు అడ్డుకట్ట

Mid-day-Meal

ఆసిఫాబాద్: ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన అక్రమాలకు అడ్డుకట్టపడనుంది. విద్యార్థులు భోజనం చేయకపోయిన చేసినట్లు లెక్కలు సృష్టించి బిల్లులను స్వాహా చేయడం కుదరదు. పాఠశా లలో రోజువారీగా ఎంత మంది విద్యార్థులు భోజనం చేస్తున్నారో సంబంధిత వివరాలు అదే రోజు రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి మేసేజ్ పెట్టాలి. ఫిబ్రవరి 1 నుండి ఈ పథకాన్ని జిల్లాలో అమలు చేస్తున్నారు. దీన్ని వల్ల మధ్యాహ్న బోజనం పథకంలో ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా విద్యార్థుల హాజరు శాతాన్ని ఖచ్చితంగా లెక్కించవచ్చు. ఈ విధానాన్ని అధికారులు పకడ్బందీగా చేపట్టాలి. పేద విద్యార్థులకు చదువుతో పాటు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశ్య ంతో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న బోజన పథకా న్ని అమలు చేశారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో విద్యార్థులకు సన్నం బియ్యం పెడుతున్నారు. కుమ్రం భీం జిల్లాలో 1226 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 93664 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థుల భోజనానికి ప్రభుత్వం రోజు 94 వేల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. పాఠశాలలో ఈ పథకం బాగానే అమలు అవుతున్నా చాల చోట్ల దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపణాలు ఉన్నా యి. ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల లెక్కలు తప్పు గా రాయడంతో భారీగా ప్రజాధనం దుర్విని యోగం అవుతోంది. ఒక పాఠశాలలో వందమంది విద్యార్థులు ఉంటే ఏదో ఒక రోజు 40 మంది పాఠశాలకు వస్తుం టారు. ప్రధానోపాధ్యాయుడు మాత్రం 80 మంది వచ్చినట్లు నమోదు చేయడంతో 40 మంది విద్యార్థులు అదనంగా భోజనం చేస్తున్నట్లు హాజరు పట్టికలో నమోదు చేసి వారి డబ్బులను స్వాహా చేసుకుంటు న్నారు.

పాఠశాలలో రోజువారీగా ఎంత మంది విద్యార్థులు భోజనం చేశారు. అనేది తెలుసుకునేం దుకు ఆటోమెటిక్ రిపోర్టింగ్ సిస్టిమ్ విద్యాశాఖ రూపొందించింది. ఈ విధానం అమలుకు మండల విద్యాశాఖాధికారులు అన్ని ప్రభుత్వ పాఠశాలలో సెల్ నంబర్లను సంబంధిత వెబ్‌సైట్‌లలో పొందుపరిచారు. ఈ విధానంతో ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసిన విద్యార్థుల వివరాలను ఆ సిస్టిమ్ ద్వారా నివేదించేం దుకు ఎంఇఒ, పాఠశాల ప్రధానోపాధ్యాయుల సెల్‌నెం బర్లను, ట్రోల్‌ఫ్రీ నెంబర్‌కు అనుసంధానం చేశారు. ప్రతిరోజు ఎంత మంది భోజనం చేశారో అనే వివరాలు మధ్యాహ్నం 2 గంటలలోపు ఎస్‌ఎంఎస్ రూపంలో పంపించాలి. దీని వల్ల బోగస్ విద్యార్థుల నమోదు అవకాశం లేకుండాపోతుంది. విద్యార్థుల సంఖ్యను తప్పుగా పంపితే దొరికిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి ఆయా పాఠశాలలకు బియ్యం కేటాయిం చడంతోపాటు నిత్యావసర సరుకుల బిల్లులను మంజూరు చేసే అవకాశం ఉంటుంది. ఈ ఎస్‌ఎంఎస్ తప్పుగా పంపిస్తే పర్యవేక్షణకు వచ్చే అధికారులకు దొరికే వీలు ఉంటుంది. పకడ్ఫందీగా పర్యవేక్షణ చేస్తేనే ఇందులో జరుగుతున్న లోపలను గుర్తించవచ్చు. ఈ విధానంలో నేరుగా రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి వివరాలు చేరడం వల్ల విధులు మంజూరు చేసేందుకు అవకాశం ఉంటుంది.

బోగస్‌ను అరికట్టేందుకు ఈ పథకం: డిఇఒ రఫీక్

మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఎస్‌ఎంఎస్ విధానం ద్వారా బోగస్ హాజరును అరికట్టే ఆస్కారం ఉంటుంది. మధ్యాహ్న సమయంలో ఎవరూ భోజనం చేయనున్నారో ఉదయం పూటనే విద్యార్థుల వివరాలు తదితర వివరాలను రిజిస్టార్‌లో నమోదు చేయాలి. మధ్యాహ్నం 2 గంటలలోపే ట్రోల్‌ఫ్రీ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేయాలి. దీనిని పకడ్భందీగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నాం.

Comments

comments