Home తాజా వార్తలు క్యూనెట్ మోసం… సామాన్య ప్రజలే టార్గెట్: సిపి

క్యూనెట్ మోసం… సామాన్య ప్రజలే టార్గెట్: సిపి

SP Sajjanar

హైదరాబాద్: దేశవ్యాప్తంగా దాదాపు రూ.20 వేల కోట్ల మోసం జరిగిందని సిపి సజ్జనార్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉందని, బాధితులకు న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. సామాన్య ప్రజలే టార్గెట్‌గా ఈ క్యూనెట్ మోసం జరిగిందని వెల్లడించారు. 

ఇలా చేస్తున్నారు…

తీపి కబుర్లు చెప్పి నిరుద్యోగులను ఆకర్షిస్తున్నారు. ముఖేశ్ అంబానీ అంతటివాడివి అవుతావని చెప్పి మత్తులో ఉంచి పెట్టుబడి పెట్టిస్తున్నారు. వారే కాకుండా వారి చుట్టాలు, స్నేహితులకు ఫోన్లు చేయించి పెట్టుబడి పెట్టిస్తున్నారు. ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తున్నారు. కాస్ట్ ఆప్టిమైజేషన్ బిజినెస్, హెల్త్ అండ్ వెల్‌నెస్ ప్రాడక్ట్, వాచెస్, జూవలరీ, పర్సనల్ వస్తువులు, సౌందర్య ఉత్పత్తులు, విహార యాత్రలు, ఎడ్యుకేషన్ ప్యాకేజీల పేరుతో అమాయకులకు వలవేస్తున్నారు. ఏదైనా ఎంపిక చేసుకుని చేరాలి. చేరిన నెలలో మోటివేషన్ క్లాసులు, బుక్స్ ఇవ్వడం, శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. కొత్తగా చేరిన వారికి కొన్ని వస్తువులు ఇస్తారు, దీంతో ప్రమోటర్‌కు కమీషన్ వస్తుంది. ఇలా ప్రతి ఒక్కరూ ఇద్దరిని చేర్పిస్తూ పోవాలి, సభ్యులు చేరిన కొద్ది పైస్థాయిలో ఉన్న వారికి కమీషన్ వస్తుంది.