Home అంతర్జాతీయ వార్తలు ఉ.కొరియాపట్ల ఓరిమి నశించింది : అమెరికా

ఉ.కొరియాపట్ల ఓరిమి నశించింది : అమెరికా

Trump

ఉభయ కొరియాల సరిహద్దు ప్రాంతం సందర్శించిన ఉపాధ్యక్షుడు 

సియోల్: వ్యూహాత్మక ఓరిమి పాటించే సమయం తీరిందని, ఇక తాను చర్యల్లోకి దిగేలా వ్యవహరించవద్దని ఉత్తర కొరియాను అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సోమవారం నాడు హెచ్చరించారు. ఉత్తర, దక్షిణ కొరియాలను విభజిస్తున్న సరిహద్దుల్లోని ఉద్రిక్త ప్రాంతానికి పెన్స్ చేరుకొన్నారు. ఆ దేశం తన అణ్వాయుధ దాహంతో తమ దేశాన్ని, దక్షిణ కొరి యాను సహన పరీక్షకు గురిచేసిందని పెన్స్ వ్యాఖ్యానించారు. ఆ ప్రాంతానికి ఆయన అప్రకటిత పర్యటన జరిపారు. ఆసియా దేశాల్లో 10 రోజుల పర్యటనను ఆ నిస్సైనిక మండలం సందర్శనతో ప్రారంభించారు.

అక్కడి కంచె లోంచి ఉ.కొరియా సైనికులను పెన్స్ వీక్షించారు. ఉ.కొరియా సైనికుడు ఒకరు పెన్స్ ఫొటోలను తీయడం కొంత దూరం నుంచి కనపడింది. ఉ. కొరియాపై ఒత్తిడి తెచ్చి అణ్వాయుధ పరీక్షల కార్యక్రమాన్ని చైనా విర మింప జేస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశిస్తున్నట్లు పెన్స్ చెప్పారు. ఉ.కొరియా ఆదివారం నాడు అణు క్షిపణి పాటవ పరీక్షలో విఫలమయినట్లు వార్తలు వచ్చిన మరు నాడు పెన్స్ రాక చోటు చేసుకొంది. ఉ.కొరియా అణ్వాయుధాలను నిర్మించడానికి పాతికేళ్ల క్రితం తొలి ప్రయత్నం చేసినపుడే అమెరికా వ్యతిరేకించిన విషయాన్ని పెన్స్ గుర్తుచేశారు.