Home తాజా వార్తలు సౌదీ రాజును కలవనున్న అమెరికా మంత్రి…

సౌదీ రాజును కలవనున్న అమెరికా మంత్రి…

Mike Pompeo will meet King Salman of Saudi King

దుబాయ్: సౌదీ అరేబియా జర్నలిస్టు ఖషోగ్గి అదృశ్య కేసు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో సౌదీ రాజు కింగ్ సల్మాన్‌ను కలవనున్నారు. సల్మాన్‌ను కలిసిన అనంతరం పొంపియో టర్కీలో కూడా పర్యటించనున్నారు. రెండు వారాల క్రితం ఇస్తాంబుల్‌లోని సౌదీ కౌన్సులేట్‌కు వెళ్లిన తర్వాత ఖషోగ్గి అదృశ్యమయిన సంగతి తెలిసిందే. కాగా, జర్నలిస్టు ఖషోగి హత్యకు గురైనట్టు స్థానిక మీడియా వెల్లడించింది. సౌదీ ఏజెంట్లు ఖషోగ్గిని హత్య చేసినట్టు ఆరోపణలు వెలువడుతున్నాయి. అయితే, సౌదీ మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది.

ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగిన ట్రంప్… దుష్ట హంతకులను పట్టుకుంటామన్నారు. ఖషోగ్గి హత్య కేసులో సౌదీ రాజు సల్మాన్‌తోనూ ట్రంప్ చర్చలు జరిపినట్టు సమచారం. అయితే ఆ హత్య గురించి తనకు ఏమీ తెలియదని కింగ్ చెప్పినట్టు తెలుస్తోంది. అదృశ్యమైన ఖషోగ్గి యుఎస్ కు చెందిన వాషింగ్టన్ పోస్టు పత్రికలో జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్నారు.

Mike Pompeo will meet King Salman of Saudi King