Search
Sunday 18 November 2018
  • :
  • :

కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీ

hema-maliniఒకప్పటి బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని ఇప్పుడు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో ప్రధాన పాత్రలో నటించింది. బాలకృష్ణ 100వ చిత్రంగా క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. ఈ చిత్రంలో హేమామాలిని.. శాతకర్ణి తల్లి రాజమాత గౌతమిగా నటించింది. శాతకర్ణి భార్యగా శ్రియా శరణ్ చేసింది. తాజాగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం గురించి ట్వీట్ చేసింది హేమామాలిని. “ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ షూటింగ్ పూర్తయింది. హీరో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్, శ్రియాశరణ్‌లతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చింది. నా కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్ మూవీ ఇది”అని ఆమె పేర్కొంది. ఇక షూటింగ్ పూర్తిచేసుకొని గుమ్మడికాయ ఫంక్షన్‌ను జరుపుకుంది ఈ చిత్రం. రామోజీఫిల్మ్ సిటీలో బాలకృష్ణ, శ్రియాశరణ్, హేమామాలినిలపై చివరి సన్నివేశాన్ని తెరకెక్కించాడు దర్శకుడు క్రిష్. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకొని సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.

Comments

comments