Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

శిథిలావస్థలో పాలశీతలికరణ కేంద్రం

  • ప్రస్తుత పాలకు తగ్గట్టుగా కూలింగ్ నిర్వాహణ లోపం
  • పరిసరాల చుట్టూ దుర్గంధం వస్తుందని ఫిర్యాదు

Milk-Cool-Centreకల్వకుర్తి  : పాల శీతలీకరణ కేంద్రంలో యంత్రాలలో వినియోగించిన నీటి నుంచి వెలువడే దుర్వాసన నివారించడంతో పాటు నీటి వృధాను అరికట్టేందుకు ఇపిలియంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. గతంలో ఏర్పాటు చేసిన ప్లాంట్ కొద్ది రోజులకే పని చేయకుండా మొరాయించడంతో కొత్తగా ఏర్పాటు చేసిన ప్లాంట్‌తో వ్యర్థ నీటిని శుద్ది చేసి తిరిగి ఆ నీటిని ఇతర వాటికి ఉపయోగిస్తు న్నారు. దీంతో నీటి వృధాతో పాటు ఉన్న మురుగు సమస్య తీరి పోయింది. దుర్వాసనతో ఇబ్బందులు… పట్టణంలోని పాలశీతలీకరణ కేంద్రం ఏర్పాటు చేసి సుమారు 40ఏళ్ళు గడిచింది. గ్రామాలలో సోసైటీ కేంద్రాల నుంచి సేకరించి తీసుకువచ్చిన పాలు కల్వకుర్తి కేంద్రంలో చిల్లింగ్ చేస్తారు.ఆ సమయంలో యంత్రాలలో వాడిన నీరు పూర్తిగా కలుషితమౌతుంది. ఆ వృధా నీరు కాలువల ద్వారా పక్క కాలనీ లోకి, రోడ్డుపై వదిలారు. దీంతో దుర్గంధం వెదజల్లుతూ పలు ఇబ్బందులకు గురవుతున్నామని కాలనీ వాసులు ఫిర్యాదు చేస్తున్నారు. 15 సంవత్సరాల క్రితం వృధా నీటిని శుద్ది చేయాలని, ఈటి ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు.కాని ఆ ప్లాంట్ 60రోజులు పని చేయకుండానే మరమ్మత్తుకు గురైంది. ఆ తరువాత ప్లాంట్ శిధిలావ్యస్థకు చేరింది. మళ్ళి యధావిధిగా మురుగు నీరు కాలనీలోకి వెళ్ళడంతో పంచాయతీ మొదటికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సాయంతో దుర్వాసన వస్తున్న నీటిని శుద్ది చేసేందుకు రాష్ఠ్రీయ కర్షక్ వికాస్ యోజన పథకం కింద ఈటి ప్లాంట్ నిర్మిస్తున్నామని ప్రస్తుతం కల్వకుర్తిలో నెలకొల్పారు. అదే విధంగా అచ్చంపేట, కల్వకుర్తిలో నిర్మాణ పనులు పూర్తి చేశారు. సుమారు 12లక్షలతో నిర్మించిన ఈ ప్లాంట్ కల్వకుర్తి కేంద్రంలో విజయవంతంగా పని చేస్తుంది. కేంద్రంలో 10లీటర్ల నీరు నిత్యం వృధా అవుతుంది. ఈ నీటిని ఈటీ ప్లాంట్ ద్వారా శుద్ది చేసి మళ్ళి పాలశీతలీకరణ కేంద్రంలో ఈ నీటిని ఐస్ తయారీకి ఉపయోగిస్తున్నారు. చుక్కనీరు వృధా కాక పోవడంతో పాటు కాలనీ వాసులకు దుర్గంధం సమస్య తీరిపోయింది. ఈ ప్లాంట్ వల్ల కూలింగ్ వాడుతూ మిగిలిన నీటితో క్యాన్లను పరిసరాలను శుద్ది చేసేందుకు ఉపయోగిస్తున్నామని శీతలీకరణ కేంద్రం మేనేజర్ మల్లీశ్వర్ గుప్త తెలిపారు. ఇతర ప్రాంతాల నుండి పాలు తగ్గాయి…వేసవి కాలం సమీపించడంతో పాల ఉత్పత్తి తగ్గిందని గతంలో ఉన్నట్టుగా చుట్టు పక్కల గ్రామాల నుండి పాలు రావడంలేదని పెద్ద ఎత్తున ఆవు పాలే వస్తున్నాయని వేసవిలో పాలు తగ్గడంతో కొంత ఇబ్బంది ఎదుర వుతుందని పై అధికారులు సైతం ఉత్పత్తిని పెంచేం దుకు చర్యలు తీసుకోవాలనే ఒత్తిడి ఉందని మేనేజర్ తెలిపారు. దీనిపై సహాకార సంఘాలతో సమావేశం నిర్వహిస్తున్నామని భయటి వాటి కంటే ధర ఎక్కువ చెల్లించాలనే కొన్ని గ్రామాలలో డిమాండ్ ఉందని మేనేజర్ తెలిపారు.త్వరలోనే రేటును చెల్లిస్తామని ఎండి గారు అంగీకరించారని ఉత్పత్తిదారుల సహాకార సంఘం చైర్మన్ బండెల రాంచంద్రారెడ్డి తెలిపారు.

Comments

comments