Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

చేతి కందే పంట డోజర్ల పాలు!

field

*సుందిళ్ల బ్యారేజీ కరకట్ట పనుల్లో వరి పంటను తొలగిస్తున్న వైనం
*అడ్డుకున్న రైతులు,పోలీసుల రంగ ప్రవేశం,బందోబస్తు నడుమ పనుల నిర్వహణ
*లబోదిబోమంటున్న రైతులు- పక్షం రోజులు పనులను ఆపాలని మొర
*తొలగించిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని రైతుల డిమాండ్

మనతెలంగాణ/మంథని: సుందిళ్ల బ్యారేజీ నిర్మాణం కరకట్ట పనుల్లో భాగంగా మంథని నియోజకవర్గం పరిధిలోని రామగిరి మండలం ముస్తాల గోదావరి తీరాన మరో పది రోజుల్లో చేతికి అందే వరి పంటను పోలీసుల బందోబస్తుల నడుమ అధికారులు గురువారం డోజర్ల సహయంతో తొలగిస్తుండగా, ఈ విషయం తెలుసుకున్న బాధిత రైతులు, కౌలు రైతులు నడిపెల్లి రాజేశ్వర్‌రావు, వసినేని సత్యనారాయణరావు, చీదురాల సురేందర్‌రెడ్డి, కోమిరినేని శ్రీనివాస్, గు ంటుకు శ్రీనివాస్, మహేందర్‌రావు, గడ్డం వెంకటేష్ తదితరులు ఈ పనులను అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సుందిళ్ల బ్యారేజీ అధికారులు గోదావరిఖని టూటౌన్ పోలీసులకు సమాచారం అందించగా సిఐ శ్రీనివాస్, ఎస్‌ఐ సహదేవ్‌సింగ్‌తో పాటు పోలీసులు రంగ ప్రవేశం చేసి, రైతులను అడ్డుకున్నారు. అంతే కాక పోలీసుల బందోబస్తు న డమ డోజర్‌తో పంటను తొలగించే పనులను చేపట్టారు. ఇదేమని తాము ప్రశ్నిస్తే ఈ భూములను ఇది వరకే ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కింద తీసుకోని నష్టపరిహారం సైతం చెల్లించడం జరిగిందని, ఈ భూముల్లో ప్రాజెక్టు నిర్మాణ ప నులు చట్టబద్ధంగానే చేపడుతున్నామని సుందిళ్ల బ్యారేజీ డిఇఇ బండారి భద్రయ్య తెలిపారు. తమ భూములను సుందిళ్ల బ్యారేజీ కింద తీసుకోని నష్టపరిహారం చెల్లించింది వాస్తవమేనని కానీ, తమకు యాసంగి పంట సాగుకు అనుమతి ఇవ్వాలని బ్యారేజీ అధికారులను గతంలో కోరడంతో పాటు పనులను అడ్డుకోవడం జరిగిందని తెలిపారు. ఆ సమయంలో తమకు మౌఖికంగా ఈ యాసంగి పంటల సాగుకు అనుమతి ఇచ్చారని, పంటలు కోసిన తర్వాతే కరకట్ట నిర్మాణ పనులు చేపడుతామని తమకు హామీ ఇచ్చి, నేడు ప్రభుత్వం, మంత్రి హరీష్‌రావు నుంచి ఒత్తిడి రావడంతో చే తికందే పంటలను డోజర్లతో తొలగిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. సుందిళ్ల బ్యారేజీ నిర్మాణం కింద ముస్తాల గ్రామంలో 21మంది రైతుల నుంచి సుమారు 72 ఎకరాలను తీసుకోని, నష్టపరిహారం సైతం చెల్లించడం జరిగింది. ఈ దశ వసినేని రవీందర్‌రావుకు చెందిన పట్టా భూమిని అతని అన్నయ్య వసినేని సత్యనారాయణరావు కౌలు రైతు తను కౌలుకు తీసుకోని వరి పంటను సాగు చేయగా సుమారు రెండు ఎకరాల మేర కరకట్ట పనుల్లో భాగంగా గు రువారం డోజరు సహయంతో పంటను తొలగించారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి, ఎన్నో కష్టాలను ఎదు ర్కొంటూ సాగు చేసిన వరి పంట మరో పక్షం రోజుల్లో చేతికందుతుందని, అప్పటి వరకు తమ పంటలను తొ లగించవద్దని రైతులు కోరుతున్నారు. అలాగే ఇప్పటి వరకు తొలగించిన పంటలకు వ్యవసాయాధికారులతో పంట నష్టం సర్వే జరిపించి, నష్టపరిహారం చెల్లించి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్, పాలకులు తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు, కౌలు రైతులు కోరుతున్నారు.

Comments

comments