Home కామారెడ్డి ప్రోత్సాహం కొరవడిన పాడి పరిశ్రమ

ప్రోత్సాహం కొరవడిన పాడి పరిశ్రమ

 Milk producers are the right price for farmers

మనతెలంగాణ/కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో అధిక పాల దిగుబడి సాధిస్తున్న సర్కారు తోడ్పాటు లేక పాడిపరిశ్రమ ఇబ్బందుల పాలు అవుతుంది. పాల ఉత్పత్తి దారులు రైతులు సరైన ధర లేక ఖర్చులు అధికమై అవస్థల పాలవుతున్నారు. గడ్డి విత్తనాలు దాణా పాల డైరీల విస్తరణ రుణాల మంజూరిలో అధికారుల సహాయం లేక పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతుంది. పాల ఉత్పత్తిలో ఉన్న రైతుకు శ్రద్ధ్దవున్నా ప్రోత్సాహం కరువై పాడిరైతులు దిక్కులు చూస్తున్నారు. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమపై జిల్లాలో వేలాది మంది ఆధారపడి జీవిస్తున్నారు. కామారెడ్డి 1979లో నెలకొల్పిన పాల డైరీ పాల సేకరణ లక్షాన్ని అందుకోలేక పోతున్నారు. అంగన్‌వాడీలకు హాస్టళ్లకు, గురుకులాలకు సరఫరా చేస్తున్న పాల పాకెట్ ల విభాగం మూతపడింది. గత డైరీ అధికారుల అలసత్వంతో పాడిరైతులు నష్టాల పాలైయ్యారు. రైతుల శిక్షణ కొరవడింది. మండల జిల్లాస్థాయి పాల కేంద్రాలలో పాలు కల్తీ అవుతున్నా అరికట్టే నాధుడు లేకుండా పోయాడు. పాల రైతులకు నెలల తరబడి బిల్స్ పెండింగ్ ఉండడంతో ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. మండలస్థాయిలోని బల్క్ మిల్క్ సెంటర్లలో కల్తీ పాలు అవినీతి అక్రమాలు నిధుల దుర్వినియోగంపై పలు ఆరోపణలు వస్తున్నాయి. రైతులకు పశువైద్య విభాగానికి సమన్వయం కొరవడి పాల ఉత్పత్తి పై ప్రభావం చూపుతుంది. ప్రభుత్వ డైరీలు నష్టాలపాలైతే ప్రైవేటు డైరీలు లాభాల బాట పడుతున్నాయి. పాడి పశువుల రుణాలు అందడం గగనంగా మారింది. కొత్తడైరీ నెలకొల్పడం, పాత డైరీల విస్తరణకు ప్రోత్సాహం కరువైంది. అధికారుల పాలకేంద్రాల పాలక వర్గాలతో పాడి రైతులు విసిగిపోతున్నారు. లక్షలు ఖర్చుపెట్టి నిర్మించిన సిబ్బంది క్వార్టర్లు నిరుపయోగంగా ఉన్నాయి. లక్షం మేరకు పాల సేకరణ జరగడం లేదని రైతులు వాపోతున్నారు. మండల స్థాయి పాలకేంద్రం జిల్లా స్థాయి పాల కేంద్రం పాలన సవ్యంగా లేదని రైతులు వాపోతున్నారు. 170 గ్రామాలకు కేంద్రమైన నర్సన్నపల్లి డైరీ రోజుకు 45వేల పాల సేకరణ లక్షం ఉండగా ప్రస్తుతం 20వేల లీటర్లు మాత్రమే సేకరిస్తున్నారు. కొత్త డైరీల స్థాపనకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరుతున్నారు. మండల స్థాయిల్లో , బల్కు సెంటర్లలో తప్పులు జరుగకుండా రైతులు ఇబ్బంది పడకుండా తగు చర్యలు తీసుకోవాలని పాడి రైతులు కోరుతున్నారు.