Home తాజా వార్తలు యువకుడిపై ఎంఐఎం కార్యకర్తల దాడి

యువకుడిపై ఎంఐఎం కార్యకర్తల దాడి

ACCIDENTహైదరాబాద్: గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. మలక్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముసారాంబాగ్ శ్యాం హోటల్ వద్ద గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఎంఐఎం కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు ఒక యువకుడిని విచక్షణరహితంగా కొట్టారు. తీవ్ర గాయాలైన అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే వ్యక్తిగత గొడవలే ఈ ఘటనకు కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.