Search
Sunday 23 September 2018
  • :
  • :

మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిపై ఎంఐఎం కసరత్తు

పార్టీ అధిష్టానం వద్ద పైరవీలు
పోటీ పడుతున్న మహిళా కౌన్సిలర్లు

MUNCIPAL

మన తెలంగాణ/తాండూరు : తాండూరు మున్సిపల్ చైర్మన్ కోట్రిక విజయలక్ష్మి రాజీనామా చేస్తుందని మంత్రి మహేందర్‌రెడ్డి ప్రకటించడంతో ఎంఐఎం పార్టీ నుండి చైర్మన్ అభ్యర్థి కోసం కసరత్తు ప్రారంభమైంది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రస్తుత చైర్మన్ కోట్రిక విజయలక్ష్మి రాజీనామా చేయాల్సి ఉంది. ఈ విష యాన్ని మంత్రి మహేందర్‌రెడ్డి మంగళవారం ఆయన నివాసంలో చైర్మన్ కోట్రిక విజయలక్ష్మి రాజీనామా చేస్తుందని భర్త ఆరోగ్య పరిస్థితి బాగా లేని కారణంగా ఆలస్యమైందని ప్రకటించారు. అనంతరం టిఆర్‌ఎస్ కౌన్సిలర్‌ల మద్దతు ఉంటుందని ప్రకటించారు. దీంతో ఎంఐఎం కౌన్సిలర్‌లు చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారు పైరవీలు ప్రారంభించారు. తాండూరు మున్సిపల్ లో ఎంఐఎం పది స్థానాలను గెలుచుకుంది. అయితే తాండూరు మున్సిపల్ స్థానం జనరల్ మహిళలకు కేటాయించడంతో ఎంఐఎం నుండి విజయం సాధించిన మహ్మదీ బేగం,మలైకబేగం, సోఫియా, అప్షియా బేగంలు ఉన్నారు. గతంలో సోఫియాను చైర్మన్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా మహ్మదీ బేగం పేరు ప్రధానంగా వినిపిస్తుంది.అయితె అధిష్టానం వద్ద ఎవ్వరికి వారు పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. ఎంఐఎం పది స్థానాలు.టిఆర్‌ఎస్ పది స్థానాలలో ఉండటంతో చైర్మన్ స్థానానికి కావాల్సిన మెజార్టి ఉంది.దీంతో ఎంఐఎం చైర్మన్ కావడం సులభంగా ఉంది.దీంతో పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్‌లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.అయితె పార్టీ అధ్యక్షులు హాది శహారి మాత్రం ప్రస్తుతం ఎవ్వరి పేరును ప్రస్తావించడం లేదని పార్టీ అధిష్టానం ఎవ్వరిని ఖరారు చేసిన అందరం కలిసికట్టుగా ఉంటామని పేర్కోన్నారు.ప్రస్తుత చైర్మన్ రాజీనామా అనంతరం ఎంఐఎం పార్టీ చైర్మన్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.

Comments

comments