Home Default ప్రతిపక్ష హోదా కోరుతాం…

ప్రతిపక్ష హోదా కోరుతాం…

Asaduddin Owaisiహైదరాబాద్‌ : తమ పార్టీకి తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని కోరుతామని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ తరువాత ఎంఐఎం రెండో అతి పెద్ద పార్టీగా అవతరించిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ కంటే ఎంఐఎంకే ఎక్కువ మంది ఎంఎల్ఎలు ఉన్నారని ఆయన చెప్పారు. ఇదే విషయాన్ని స్పీకర్ ను కలిసి చెబుతామని, సభలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతామని ఆయన పేర్కొన్నారు. తమ విన్నపానికి స్పీకర్ సానుకూలంగా స్పందిస్తారన్న ఆశాభావాన్ని అసదుద్దీన్ ఓవైసీ వ్యక్తం చేశారు.

MIM Chief Asaduddin Owaisi Comments On Congress