Home తాజా వార్తలు ఎంఐఎం మా ఫ్రెండ్లీ పార్టీ : కెసిఆర్

ఎంఐఎం మా ఫ్రెండ్లీ పార్టీ : కెసిఆర్

MIM is Our Friendly Party: KCR

హైదరాబాద్ : కేంద్రంలో తాము మిత్రపక్షం కాదని తెలంగాణ ఆపద్ధర్మ సిఎం కెసిఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన తెలిపారు. ఎంఐఎం తమ ఫ్రెండ్లీ పార్టీ అని, ఆ పార్టీతో కలిసి పని చేస్తామని కెసిఆర్ స్పష్టం చేశారు. త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్‌లో తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని 2001లోనే చెప్పానని కెసిఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ తెలంగాణను భిక్షమెయ్యలేదని, తెగించి కొట్లాడి తెచ్చుకున్నామని ఆయన స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ వల్లే కాంగ్రెస్ రూ. 2 వేల పెన్షన్ ప్రకటించే పరిస్థితి వచ్చిందని కెసిఆర్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వందకు పైగా అసెంబ్లీ స్థానాలు గెలిచి , తిరిగి అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

MIM is Our Friendly Party: KCR