Home వరంగల్ ఇక సెలవు

ఇక సెలవు

 Mimicry Artist Nerella Venu Madhav Dies today

మన తెలంగాణ/ వరంగల్ అర్బన్ జిల్లా ప్రతినిధి : ధ్వని అనుకరణ సామ్రాట్, మిమిక్రీ కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం తెచ్చిన పద్మశ్రీ డాక్టర్ నేరళ్ళ వేణుమాధవ్ మృతి వార్త తలియగానే రాజకీయ ప్రముఖులు, కళాకారులు తరలొచ్చారు. నేరెళ్ల పార్థివదేహాన్ని సందర్శించి నివాళ్లర్పించారు. కడసారి చూపుకోసం కళాకారులు తరలొచ్చారు. ప్రజాగాయకుడు ప్రముఖ కళాకారుడు దేశపతి శ్రీనివాస్, సినీరంగంలోని హాస్యనటుడు వేణుమాధవ్‌తో పాటు, జబర్థస్థు టీం వెంకీ, నరేష్ తదితరులు హాజరయ్యారు. బాధాతప్తహృదయాలతో క న్నీటి వీడ్కోలు పలికారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడి యం శ్రీహరి నేరళ్ల పార్థివదేహాన్ని సందర్శించి ఆయన మృతి కళారంగానికి తీరని లోటని అభివర్ణించారు. నేరళ్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు స్పీకర్ మధు సుదనాచారి, ఎంపిలు బండా ప్రకాశ్, సీతారాంనాయ క్, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, నగర మేయర్ నన్నపునేని నరేందర్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ జడ్‌పి ఛైర్మన్ సాంబారి సమ్మారావు, వికలాంగుల సంస్థ ఛైర్మన్ కెతిరి వాసుదేవరెడ్డి, అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి కా టా, నగర పోలీస్ కమిషనర్ రవీందర్ తోపాటు అధికా రులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
మిమిక్రి కళకు ఐ కాన్‌గా పేరొంది, అనేక అవార్డులు, పురస్కారాలతో పాటు ప్రభుత్వ పదవులలో కొనసా గిన మిమిక్రి కళాసామ్రాట్ నేరళ్ళ వేణుమాధవ్ అధికార లాంఛనాలతో నిర్వహించారు. వేలమంది హాజరై అంతిమయాత్రలో పాల్గొన్నారు. కొత్తవాడ నుంచి కొత్తవాడ ఆటోనగర్ హింధూ స్మశానవాటిక వరకు నివాళ్ళర్పిస్తు అంతమయాత్ర సాగింది. వేలాది మంది అభిమానులు నేరళ్ళను కడసారి చూసేందుకు పరితపించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నగర పోలీసు కమిషనర్ రవీందర్ పర్యవేక్షణలో నేరళ్ళ వేణుమాధవ్‌కు అంత్యక్రియలు నిర్వహించారు.
పలువురి సంతాపం..
పద్మశ్రీ డాక్టర్ నేరళ్ళ వేణుమాధవ్ మృతి పట్ల పలువురు దిగ్భంధి చెందినట్లు ప్రకటించారు. ఆయన మృతి తారని లోటని అన్నారు. నేరళ్ళ మృతికి చిం తి స్తు ఆయను కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి ప్రకటించారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బో యినపల్లి వినోద్ కుమార్ ఒక ప్రకటనలో సంతా పం ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ(టిడిపి) పొలిట్‌బ్యూరో సభ్యులు రేవూరి ప్రకాశ్‌రెడ్డితో పాటు టిడిపి నేతలు, అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు, నాయకులు, సిపిఎం, సిపిఐ, ప్రజాసంఘాలు, కళాకారులు, తదితర శ్రేణులు సంతాపం ప్రకటించాయి. టిఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తక్కళ్ళపల్లి రవీందర్‌రావు, కాంగ్రెస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి స్వయంగా పార్థీవదేహాన్ని సందర్శించి నివాళ్ళర్పించారు.