Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

నేరెళ్ల ఇకలేరు

Nerella-Venu-Madhav

వరంగల్: ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ (85) మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మిమిక్రీ కళాకారులు, ఆయన అభిమానులు, స్నేహితులు వేణుమాధవ్ మరణవార్త విని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వరంగల్ జిల్లా మట్టెవాడ గ్రామంలో శ్రీహరి, శ్రీలక్ష్మి దంపతులకు డిసెంబర్ 28, 1932వ సంవత్సరంలో జన్మించారు. శ్రీరాజ-లక్ష్మీ ఫౌండేషన్ అవార్డు, పలు అవార్డులతో పాటు ఇగ్నో గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళంలో అనే ప్రదర్శనలు చేసి ప్రశంసలు అందుకున్నారు. పివి నరసింహా రావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వేణుమాధవ్ ఎంఎల్సిగా పని చేశారు. 2001లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

 నేరెళ్ల వేణుమాధవ్ మృతిపట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ల వేణుమాధవ్ మృతి మిమిక్రీ కళారంగానికి తీరని లోటు అని కెసిఆర్ తెలిపారు. మిమిక్రీ కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం తెచ్చిన వ్యక్తి నేరెళ్ల అని, ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రశంసల వర్షం కురిపించారు.  మిమిక్రీ కళను పాఠ్యాంశంగా, అధ్యయనాంశంగా వేణుమాధవ్  మలిచారని పొగిడారు. నేరెళ్ల వేణుమాధవ్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని సిఎస్ ఎస్‌కే జోషికి కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు.

 

Comments

comments