Home తాజా వార్తలు మినీ ట్యాంక్ బండ్ అపరిశుభ్రతపై నిరసన

మినీ ట్యాంక్ బండ్ అపరిశుభ్రతపై నిరసన

mini tank band

 

మల్కాజిగిరి: అధికారుల నిర్లక్షంతో మినీ ట్యాంక్ బండ్ మురికి కూపంగా మారుతోందని స్వచ్ఛ భారత్ అభియాన్ మల్కాజిగిరి కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సఫిల్ గూడ చెరువులో పేరుకుపోయిన చెత్తా చెదారాలను తొలగించడంతో మున్సిపల్ అధికారుల నిర్లక్షాన్ని నిరసిస్తూ బుధవారం సర్కిల్ కార్యాలయం ముందు కమిటీ సభ్యులు ప్ల కార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేసి సర్కిల్ ఉప కమీషనర్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కన్వీనర్ బి. నాగరాజు మాట్లాడుతూ… వినాయక చవితి, బతుకమ్మ పండగల సమయంలో సఫిల్ గూడ చెరువులో వేసిన విగ్రహాలను, బతుకమ్మలను తొలగించడంలో సంబంధిత అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. మినీ ట్యాంక్ బండ్‌లో చెత్తా చెదారాలను తొలగించాలని స్వచ్ఛ భారత్ అభియాన్ మల్కాజిగిరి కమిటీ, మినీ ట్యాంక్ బండ్ వాకర్స్ అసోసియేషన్, లాఫింగ్ క్లబ్ అసోసియేషన్, యోగా క్లబ్ సభ్యులు స్థానిక మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చుట్టు పక్కల ప్రజలు ఇక్కడికి వాకింగ్‌కు, వ్యాయామం, సేద తీరేందుకు యువకులు, వృద్దులు, మహిళలు, చిన్నారులు వస్తుంటారని చెరువులో పేరుకుపోయిన చెత్తా చెదారాల కారణంగా వచ్చే దుర్గంధంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

mini tank band protesting against uncleanness

Telangana Latest News