విశాఖపట్నం : విశాఖపట్నంలో భూ రికార్డుల తారుమారు జరిగిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై శుక్రవారం మంత్రి అయ్యన్నపాత్రుడు సిట్ అధికారులను కలిశారు. భూకుంభకోణాలపై సిట్ అధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూములను కొందరు వ్యక్తులు తనకాపెట్టి 190 కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు పొందిన వ్యవహారం గురించి సిట్‌కు మంత్రి వివరించారు. ఈ వ్యవహారంపై మరిన్ని ఆధారాలతో ఈనెల 19వ తేదీన సిట్‌కు ఫిర్యాదు చేస్తానని అయ్యన్నపాత్రుడు తెలిపారు.