Home జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం

నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం

Minister chandlal were worshiped on Saturday
మనతెలంగాణ/ములుగు : మండలంలో ని జాకారం గ్రామ పంచాయతీ పరిధిలో గల గట్టమ్మ దేవాలయం సమీపంలో ఆరు ఎకరాల ఇరవై ఐదు గుంటల విస్తీర్ణంలో 7.35 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న హరిత హోటల్‌కు మంత్రిచందూలాల్ శనివారం భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వినూత్నమైన కొత్త కొత్త పథకాలు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెడుతున్నారు. దేశ చరిత్రలోనే ఎన్నడు లేనివిధంగా రైతు బంధు పథకం పెట్టి రైతులకు ఒక్కొ ఎకరానికి రెండు పంటలకు రూ. 8 వేల చొప్పున అందించడం రైతులకు గొప్ప వరమని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టని పథకాలను కూడా దేశానికి వెన్నెముక రైతన్న అని గ్రహించి హామీలు ఇవ్వని పథకాలను కూడా పెడుతూ దేశంలోనే తెలంగాణను మొదటిస్థానంలో ఉంచుతున్నారని అవే కాక మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, వితంతు, వృద్దాప్య పెన్షన్లు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, డబుల్ బెడ్ వంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు మేలు చేయుటకు కెసిఆర్ పేదింటి పెద్దకొడుకుగా నిలిచారని ఆయన అన్నారు. కెసిఆర్ పెడుతున్న అభివృద్ధి పథకాలను పేదలు సద్వినియోగం చేసుకుని రాబోయే కాలంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వంచే పట్టం కట్టి బ్రహ్మరథం కట్టుటకు ముందుకు వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ మోహన్ లాల్, ఆర్‌డిఒ రమాదేవి, తహసీల్దార్ ముల్కనూరి శ్రీనివాస్, జడ్పి ప్లోర్ సకినాల శోభన్, ఎంపిపి భూక్యా మంజుల మురళి, మండల పార్టీ అధ్యక్షుడు గట్టు మహేందర్, పోరికగోవింద్ నాయక్, కెశెట్టి కుటుంబరావు, గండ్రత్ సాగర్, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.