Home తాజా వార్తలు కరీంనగర్‌లో ‘హాక్ ఐ యాప్‌’ను ప్రారంభించిన మంత్రి ఈటల

కరీంనగర్‌లో ‘హాక్ ఐ యాప్‌’ను ప్రారంభించిన మంత్రి ఈటల

Eetela-Rajenderకరీంనగర్: జిల్లా పోలీసు కమిషనరేట్ ఆఫీసులో హాక్‌ఐ యాప్‌ను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ… షీ టీమ్స్‌తో మహిళలకు భరోసా కల్పించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందని చెప్పారు. నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు పెంచుతామన్నారు.