Search
Saturday 21 July 2018
  • :
  • :
Latest News

జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి

Minister EEtela Rajender Speech About Cultivation

మన తెలంగాణ/ కాళేశ్వరం : ప్రజలందరు జీవ వైవిద్యాన్ని కాపడుకోవలి అందుకోసం ప్రజలందరూ మొక్కలు నాటాలని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.  జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో కాళేశ్వరం అటవీ శాఖ ఆధ్వర్యంలో ముక్తి వనం ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా ఈటల రాజేందర్ వచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముక్తివనం చాలా చిన్న పని అయినప్పటికీ దాని విలువ కొన్ని వందల కోట్లు ఉంటుంది అని అన్నారు. మనిషి తన మనుగడను కొనసాగించడంలో ప్రకృతి కూడా అవసరమవుతుందని మనిషి జీవితం చాలా గొప్పదని అనుకుంటున్నామని, కానీ ఇప్పుడు చాలా శాప గ్రస్తంగ మారింది. మనిషి మనుగడకోసం చెట్లను చిన్న చిన్న జీవరాశులు చంపివేయడం వలన చాలా వనరులు దెబ్బ తిన్నాయి. ప్రాచీన జీవిత విధానంలో ఉన్న గొప్పతనం ఇప్పటి జీవిత విధానంలో లేదు అని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆత్యధిక వనరులు జలపాతలు వున్నాయని వాటిని ఇంకా అభివృద్ధి చెస్తామని ఆయన అన్నారు. కాళేశ్వరం వచ్చే భక్తులకు ముక్తివనం చాలా ఆహ్లదకరంగా పర్యటక కేంద్రంగా విలసిల్లుతుందని ఆయన అన్నారు. భవిష్యత్తులో కాళేశ్వరం చాలా అభివృద్ధి చెంది యువత అందరికీ ఉపాధి కలుగుతుందని అన్నారు. ముక్తివనం అభివృద్ధికి మరో రూ.10కోట్లు మంజురు చెస్తామని ఆయన అన్నారు. అనంతరం మంత్రి జోగు రామన్న మాట్లాడుతు ఎకో టూరిజంను దేశస్థాయి అభివృద్ధి చేస్తమని కాళేశ్వరం పుణ్యక్షేత్రముకు వచ్చే భక్తులకు చాల ఆహ్లదకరంగా ఉంటుందని ఆయన అన్నారు.  జీవము ఉన్న ప్రతి జీవి బ్రతకడానికి, జీవన వైవిద్యం కాపాడటానికి 23 శాతం గ్రీన్ కవరెజ్ 33శాతం పెం చాలి అని కెసిఆర్ హరితహార కార్యక్రమన్ని చెపట్టారు. తెలంగాణలో జరుగుతున్న పోడు వ్యవసాయానికి  తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. జయ శంకర్ భూపాలపల్లి జిల్లాని దేశంలోనే ఒక గొప్ప పర్యటక అభి వృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దుదమని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే పుట్ట మదుకర్ మాట్లాడుతూ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో డిఎఫ్‌ఓ రవి కిరణ్ పర్యటించి మంత్రి ఈటల రాజేందర్ కాళేశ్వరంలో ము క్తివనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరగా ఆయన నిధులు మం జూరు చేశారని అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి జరగలని ఉద్దే శంతో ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 25లక్షలు మంజూరు చేశానని అన్నారు. గత పాలకుల్లగ కార్యకర్తలకు లక్ష రూపాయలు ఇచ్చి జెండాలు పట్టించారు కాని అభివృద్ధి మాత్రం జరగలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌ఎస్ ఆక్బర్, జిల్లా కలెక్టర్ అమయ్ కుమా ర్,ఐ.ఎఫ్.ఎస్.రవి కిరణ్, అధికారులు ప్రజ ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

comments