Home తాజా వార్తలు యాదాద్రిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూజలు

యాదాద్రిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూజలు

Minister Errabelli Dayakar Rao

 

యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణా అభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. మంత్రి పదవి తీసుకున్న మొదటి సారిగా గురువారం రోజు మంత్రి కుటుంబ సమేతముగా స్వామి వారి దర్శనార్ధం యాదాద్రి క్షేత్రానికి వచ్చారు. ఆలయానికి వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు, దేవస్థానము ఉద్యోగ సిబ్బంది ఆలయంలోకి స్వాగతం పలుకగా శ్రీవారి బాలాలయంలో కుటుంబ సమేతముగా మంత్రి దర్శించుకొని పూజలను నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్నా మంత్రికి ఆలయ ప్రధానర్చకులు అర్చకుల బృదం స్వామి వారి ఆశీర్వచనం తీర్ధ ప్రసాదాలను అందచేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏకార్యం ముందైన ఇష్టవైవముగా శ్రీలక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడం జరుగుతుందని మంత్రిగా బాధ్యతలు తీసుకన్న మొదటి సారి స్వామి వారి ఆశీర్వచనం కోసం రావడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సూచనలతో తనకు అప్ప చెప్పిన బాధ్యతలను వమ్ము చేయకుండా పూర్తి చేసి అభివృద్ది సంక్షేమానికి ముందకు సాగుతామన్నారు. ఆయన వెంట ఎంఎల్ఎ గొంగిడి సునీతా, టిఆర్ఎస్ రాష్ట్ర రైతు సంఘం నాయకులు గొంగిడి మహేందర్‌రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటి చైర్మన్ పడాల శ్రీనివాస్, ఎంపిపి గడ్డమీది స్వప్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Minister Errabelli Dayakar Rao visit Yadadri Temple