Home తాజా వార్తలు వేతన సవరణకు అనుకూలం : ఈటల

వేతన సవరణకు అనుకూలం : ఈటల

Minister Etela Rajender Comments on Teachers

హైదరాబాద్ : వేతన సవరణకు తాము అనుకూలంగా ఉన్నామని, వేతన సవరణ చేయాల్సిందేనని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఉపాధ్యాయ ఎంఎల్‌సిలు, ఉపాధ్యాయ సంఘాల నేతలతో ఈటల నేతృత్వంలోని మంత్రుల కమిటీ శనివారం భేటీ అయింది. ఈ సందర్భంగా ఈటల మాట్లాడారు. ఉపాధ్యాయులకు సంబంధించిన నాలుగు డిమాండ్లు ఉన్నాయని ఆయన చెప్పారు. బదిలీలు, పదోన్నతులు సాధారణమైనవేనని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి సర్వీస్ నిబంధనల అంశం హైకోర్టు పరిధిలో ఉందని, ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరినట్టు ఈటల తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళుతామని ఆయన పేర్కొన్నారు. 2.50 లక్షల మందికి ఉద్యోగ భద్రత కల్పించామని ఆయన వెల్లడించారు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా బదిలీలు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.

Minister Etela Rajender Comments on Teachers