Home జాతీయ వార్తలు రాంవిలాస్ పాశ్వాన్‌తో ఈటల భేటీ

రాంవిలాస్ పాశ్వాన్‌తో ఈటల భేటీ

Delhi : Minister Etela Rajender meets Ram Vilas Paswanఢిల్లీ : కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌తో తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం భేటీ అయ్యారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు రావాల్సిన పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని మంత్రి ఈటల పాశ్వాన్‌ను కోరారు. రూ.1630 కోట్ల పెండింగ్ నిధులను విడుదల చేయాలని, మధ్యాహ్న భోజన పథకానికి గోదుమలకు బదులు సన్న బియ్యం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పాశ్వాన్‌ను కలిసిన వారిలో టిఆర్‌ఎస్ ఎంపిలు కూడా ఉన్నారు.

Minister Etela Rajender meets Ram Vilas Paswan