Home రాష్ట్ర వార్తలు సిసిఐ నిర్వాకంతోనే రైతు ఆత్మహత్యలు

సిసిఐ నిర్వాకంతోనే రైతు ఆత్మహత్యలు

etela-rajenderమన తెలంగాణ/కరీంనగర్ : దేశ వ్యాప్తంగా రైతులు పత్తి సాగులో దిగుబడి లేక, దిగుబడి అయిన పంటకు సిసిఐ గిట్టుబాటు ధర  కల్పించనందువల్లే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మంత్రి ఈటెల రాజేందర్ ఆరోపించారు.  శనివారం కరీంనగర్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ సిసిఐ కేంద్రాలు, కేంద్ర ప్రభు త్వ నిర్లక్ష ధోరణి కారణంగా పత్తి రైతుల నష్టాలకు గురవతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సిసిఐ కొనుగోలు కేంద్రాల పనితీరు నామమాత్రంగా ఉండడంతో దళారులు రైతులను ముం చుతున్నారని నిప్పులు చెరిగారు. తెలంగాణ పత్తి రైతులను ఆదుకోవాలంటూ కరీంనగర్ ఎంపి బి.వినోద్ కుమార్ ప్రభుత్వ పక్షాన కేంద్రానికి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి పత్తికి గిట్టుబాటు ధరను  ప్రకటించడంతోపాటు సిసిఐ కేంద్రాల పనితీరును మెరుగుపర్చుకోవాలని కోరారు. మరోవైపు రానున్న రోజులో మొక్కజొన్న రైతులను ఆదు కోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చిన మంత్రి వరి ధాన్యం కొనుగోలును ప్రభుత్వం  నిర్ణయించిన  కేంద్రాలలోనే అమ్ముకోవాలని  సూచించారు. ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపి బి.వినోద్, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి, మేయర్ రవీందర్ సింగ్ పాల్గొన్నారు.