Home తాజా వార్తలు ఆర్ టిసిని లాభాల బాట పట్టిస్తాం: ఈటల

ఆర్ టిసిని లాభాల బాట పట్టిస్తాం: ఈటల

eetela

హైదరాబాద్: తెలంగాణ ఆర్ టిసిని లాభాల్లో తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శుక్రవారం కరీంనగర్ నుంచి మెహిదీపట్నంకు బస్సు సర్వీసును మంత్రి ప్రారంభించారు. అనంతరం ఈటల మాట్లాడుతూ… ప్రయాణికులకు సకల సౌకర్యాలు గల బస్సు సర్వీసులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయన్నారు. కావున ప్రయాణికులు ఆర్ టిసి సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎ గంగుల కమలాకర్, ఎంఎల్ సి నారదాసు లక్ష్మణ్‌రావు, పలువురు టిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.