Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

పలు అభివృద్ధ్ది పనులకు మంత్రి జూపల్లి భూమి పూజ

pooja

మన తెలంగాణ /కోడేరు : మండలంలో పలు అభివృద్ధ్ది పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం భూమి పూజ చెశారు.  మండలంలోని పస్పుల, జనుంపల్లి, కోడేరు, తుర్కదిన్నె, రాజాపూర్, మైలారం, నర్సాయి పల్లి గ్రామాలల్లో సిసి రోడ్డు నిర్మాణాలకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. బావాయిపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చెశారు. పస్పుల గ్రామంలో రూ.65 లక్షలతో, జనుంపల్లి గ్రామంలో 28 లక్షలతో, కోడేరులో 90 లక్షలతో, మైలారం గ్రామంలో 75లక్షలతో, రాజాపూర్ గ్రామంలో 90లక్షలతో, సింగాయిపల్లి గ్రామంలో 80లక్షలతో, నర్సాయిపల్లి గ్రామంలో 75 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్ల నిర్మాణాలకు యంపిపి రాంమోహన్ రావు, జడ్‌పిటిసి బస్తీరాం నాయక్‌లతో కలిసి భూమి చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తుంద న్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండేందుకు సిసి రోడ్లు నిర్మింస్తున్నా మన్నారు. రానున్న రోజుల్లో తాగునీటి సమస్యను తీర్చనున్నామన్నారు. వృద్ధ్దులకు, వితంతువులకు ఆసరా ఫించన్లు, త్వరలో ఇళ్లు లేనివారికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించనున్నట్టు తెలిపారు. రైతులకు పెట్టుబడి సహయం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా జనుంపల్లి గ్రామంలో సర్పంచ్ భాగ్యమ్మ, మాజీ ఎంపిపి శేషన్న, నాయకులు బొందయ్య, వెంకట్‌రెడ్డి తదితరులు, కోడేరు గుట్ట కాలనిలో యువకులకు టిఆర్‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. అనంతరం మండల కేంద్రంలో ని నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి నిదులు మంజూరయ్యాయన్నారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తారన్నారు. ఇందుకు గ్రామంలోని వారంద రూ సహకరించాలన్నారు. గ్రామంలో రోడ్డు నిర్మాణంకు 60ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. రోడ్డు వెడల్పులో ఇళ్లు , స్థలాలు కోల్పొయిన వారికి ప్రభుత్వం పరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు.కార్యాక్రమంలో సర్పంచ్‌లు వేణుగోపాల్ యాదవ్, కవిత, ఆ పార్టీ నాయకులు, అధికారులు తదితరులున్నారు.

Comments

comments