Home తాజా వార్తలు టిఆర్‌ఎస్‌తోనే ప్రగతి

టిఆర్‌ఎస్‌తోనే ప్రగతి

Minister Harish Rao Comments on Congress Party over

బతుకమ్మ చీరలను అడ్డుకున్న కాంగ్రెస్
దామోదర్ హయాంలో అభివృద్ధి శూన్యం
ఇంటిలోనే నచ్చని కాంగ్రెస్ మ్యానిఫెస్టో
టిఆర్‌ఎస్ కార్యకర్తలతో మంత్రి తన్నీరు హరీష్‌రావు

మన తెలంగాణ/రాయికోడ్ : కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో నచ్చకనే మ్యానిఫెస్టో చైర్మన్, మాజీ మంత్రి దామోదర్ రాజనర్సింహా భార్య పద్మిని భారతీయ జనతా పార్టీలో చేరిపోయారని, ఇంటి వాళ్లకే నచ్చని తెలంగాణ ప్రజలకు ఎలా నచ్చుతుందని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రశ్నించారు. గురువారం మండలంలోని రాయికోడ్ చౌరస్తా చిమ్నాపూర్‌లో మండల టిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి మంత్రి హరీష్‌రావు ముఖ్య అథితిగా హాజరుకాగా ఎమ్మెల్సీ మహ్మద్ ఫరీదుద్దీన్, జహీరాబాద్ ఎంపి బిబి పాటిల్, అందోల్ టిఆర్‌ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్, టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మురళియాదవ్‌లు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో హరీష్‌రావు మాట్లాడుతూ తెలంగాణ సాంప్రదాయ పండుగైన బతుకమ్మ పర్వదినాలను ఆడపడుచులు ఆనందోత్సవాలతో జరుపుకోవాలన్న లక్షంతో చీరలను పంపిణి చేసేందుకు టిఆర్‌ఎస్ ముందుకు వస్తే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని ఆరోపించారు. అందోల్ నుంచి స్థానికుడు, ప్రజా సమస్యలు తెలిసిన జర్నలిస్టు కాంత్రి కిరణ్‌ను భారీ మెజార్టీతో శాసనసభ మెట్లెక్కించాలని సూచించారు. కాంగ్రెస్ హయాంలో అందోల్ ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని ఆరోపించారు. తండాలు పంచాయితీలుగా మార్చిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. టిఆర్‌ఎస్ హయాంలోనే రైతులు సంతృప్తిగా ఉన్నారని, రౌండ్ ద క్లాక్‌గా విద్యుత్ సరఫరా,వ్యవసాయానికి పెట్టుబడిగా ఏడాదికి రెండు మార్లు ఎకరానికి 4వేల చొప్పున అందించి ఆదుకున్నారని గుర్తు చేశారు. మిర్యాలగూడలో 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Minister Harish Rao Comments on Congress Party over