Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

కాంగ్రెస్ నాయకులపై మంత్రి హరీశ్ గరం…

harish rao visit kaleshwaram project works

పెద్దపల్లి : కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 6 ప్యాకేజీ పనులను సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ నిర్మించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేయడాన్ని హరీశ్ తప్పుపట్టారు. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జలసంఘం చెప్పిన విషయాన్నిఆయన గుర్తు చేశారు. ప్రాణహిత – చేవెళ్ల పనులు ప్రారంభించి 8 సంవత్సరాలైన ఒక్క అనుమతి తీసుకురాలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేండ్లలో అన్ని అనుమతులతో ప్రాజెక్ట్ పనులను చివరిదశకు తెచ్చిందని హరీశ్ రావు పేర్కొన్నారు. ఆగస్ట్ చివరి వారంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మొదటి పంప్ ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. 8వ ప్యాకేజీలో 139 మెగావాట్ల పంప్‌సెట్ డ్రైరన్ నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

 

Comments

comments