Home తాజా వార్తలు నా తుదిశ్వాస వరకు టిఆర్‌ఎస్‌లోనే: హరీష్

నా తుదిశ్వాస వరకు టిఆర్‌ఎస్‌లోనే: హరీష్

harish

హైదరాబాద్: నా పుట్టుక టిఆర్‌ఎస్‌లోనే.. చావు కూడా టిఆర్‌ఎస్‌లోనే అని మంత్రి హరీష్‌రావు అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సామాజిక మాధ్యమంలో తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తప్పవన్నారు. తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవాలని డిజిపిని కోరినట్లు మంత్రి చెప్పారు. ఉద్యమంలో త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చామని, తాను టిఆర్‌ఎస్‌లో క్రమశిక్షణ గల కార్యకర్తనని, సిఎం కెసిఆర్ మాటే తన బాట అని హరీష్ పేర్కొన్నారు. ఇక వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను సమర్థవంతంగా నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల మంత్రి హరీష్‌రావు సుమారు 40మంది టిఆర్ఎస్ ఎంఎల్ఎలతో బిజెపిలో చేరుతున్నారంటూ కొన్న సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హరీష్‌రావు మీడియా సమావేశంలో పైవిధంగా స్పందించారు.