Home తాజా వార్తలు ఉత్తమ్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్…

ఉత్తమ్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్…

Harish-Rao-and-Uttam-Kumar-

వనపర్తి: రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు సోమవారం టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో 70 సీట్లు గెలిచి, తెలంగాణలో అధికారం చేపడుతామని ఉత్తమ్ పగటికలలు కంటున్నారని ఎద్దేవాచేశారు. ఉత్తమ్ ఎంత తొందరగా ఆ భ్రమలోనుంచి బయటకొస్తే అంత మంచిదని మంత్రి అన్నారు. కాంగ్రెస్ నాయకులకు నిజంగా రైతులపై ప్రేమ ఉంటే ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై వేసిన తప్పడు కేసులను తక్షణమే వెనక్కి తీసుకొని అన్నదాతలకు క్షమాపణ చెప్పాలని హరీశ్ చెప్పారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నికర జలాలతో ప్రతి ఎకరాకు సాగు నీరందిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. అంతేగాక వెరుశెనగ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు కేంద్రం సహకారంతో వెరుశెనగ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.

Minister Harish Rao Fires on TPCC Chief Uttam Kumar Reddy.