Search
Saturday 22 September 2018
  • :
  • :

ప్రాజెక్టుల నిర్మాణాలపై మంత్రి హరీశ్‌ వీడియో కాన్ఫరెన్స్‌

Ramzan Dress Distributed by Harish Rao

హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న ప్రాజెక్టుల నిర్మాణాలపై అధికారులతో మంత్రి హరీశ్‌రావు బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సిద్దిపేట, సూర్యాపేట, సిరిసిల్ల, మహబూబ్‌నగర్‌ కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ… డిండి, పాలమూరు, కాళేశ్వరం ఆర్‌అండ్‌ఆర్‌ పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇళ్లు కోల్పోయిన వారికి మంచి ప్యాకేజీ ఇవ్వాలని అధికారులను సూచించారు. కల్వకుర్తి ద్వారా ఈ ఏడాది లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

Comments

comments