Home తాజా వార్తలు ముస్లింల హజ్ యాత్రకు సాయం…

ముస్లింల హజ్ యాత్రకు సాయం…

haridh

మెదక్: పట్టణంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ముస్లి మత పెద్దలతో కలిసి మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… నిరుపేదలైన ఐదుగురు ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లాడానికి ప్రతి సంవత్సరం సాయం చేయబోతున్నట్టు మంత్రి ప్రకటించారు. ముస్లింల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ పని చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. షాదీ ముబారక్ పథకం ద్వారా పేద ముస్లిం యువతుల వివాహానికి ప్రభుత్వం లక్ష నూటా పదమార్లు ఆర్థిక సాయం చేస్తుందని సూచించారు. మెదక్ జిల్లాలో లో రూ. 2 కోట్లతో షాదీఖానా కడుతున్నామని అది త్వరలోనే పూర్తవుతుందని చెప్పారు. షాదీ ముబారక్, షాదీ ఖానా ద్వారా మెదక్ లోని పేద ముస్లింలు తమ ఆడపిల్లల  వివాహాలను తక్కువ ఖర్చుతో చేయవచ్చన్నారు. ఈద్గా, మసీదు మరమ్మతులకు రెండు కోట్లు టిఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. అదే విధంగా మెదక్ లో ప్రస్తుతం ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కాకుండా మరోకటి బాలికల కోసం మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. సిద్దిపేటలో ప్రతి ఏడాదికి ఐదుగురు పేద ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లడానికి సాయం చేస్తున్నానని, ఈ ఏడాది నుంచి మెదక్ జిల్లా నుంచి ఎంపిక చేసిన ఐదుగురికి ప్రతి ఏటా హజ్ యాత్రకు వెళ్లేందుకు సాయం చేస్తానని మంత్రి హరీశ్ హామీ ఇచ్చారు.