Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

రాష్ట్రం నీటితో నిండుగా ఉండాలన్నదే సిఎం ఆలోచన

Harish-rao-image

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి చెరువులు, కుంటలను నీటితో నింపాలన్నది సిఎం కెసిఆర్ ఆలోచన అని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జలసౌధలో అధికారులతో మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర చిన్న నీటిపారుదల నెట్‌వర్క్ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ…  భారీ, చిన్న నీటి ప్రాజెక్టులకు అన్నిచెరువులు, కుంటలను అనుసంధానం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ నెలలోగా గొలుసుకట్టు చెరువులు, కుంటలను నీటితో నింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. 44,928 చెరువుల్లో ఎన్ని గొలుసుకట్టు ఉన్నాయో, ఒక్కొక్క గొలుసులో ఎన్ని చెరువులు వస్తాయో పూర్తి లెక్కలు తీయాలని మంత్రి అధికారులకు తెలియజేశారు. భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల పరిధిలో గొలుసుకట్టు చెరువులను గుర్తించాలన్నారు. చెరువుల్లో ఏఏ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు నింపవచ్చో గుర్తించాలని ఆయన అన్నారు. అనుసంధానం కాని చెరువులను ఎలా అనుసంధానిచవచ్చో ఒక ప్లానింగ్ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. తెలంగాణలో మైనర్ ఇరిగేషన్ ద్వారా 250 టిఎంసిల నీరు వినియోగంలో ఉంటుందని ప్రభుత్వ రికార్డుల ద్వారా తెలుస్తోందన్నారు. ప్రతి ప్రాజెక్టు నుంచి చెరువులు, కుంటలు నింపాలన్నారు. చెరువులు నిండుగా ఉంటే వర్షపాతం పెరుగుతుందని సూచించారు. కరవు, వడగండ్ల వాన సమస్యలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.

Comments

comments